గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2017, మంగళవారం

యత్ కటాక్ష సముపార్జనా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. యత్ కటాక్ష సముపార్జనా విధిః - సేవకస్య సకలార్థ సంపదః.
సంతనోతి వచనాంగ మానసైః - తామ్, మురారి హృదయేశ్వరీమ్ భజే.
గీ. సకల పురుషార్థ సంపద లొసగు నెట్టి
లక్ష్మి క్రీఁగంటి చూపుఁ దలచి భజించు
సేవకుల కట్టి హరిపత్ని! సేవఁజేతు
మనసు వాక్కాయ కర్మలన్ మహిని నీకు.
భావము. ఓ వరలక్ష్మీదేవీ! ఏ తల్లి క్రీగంటి చూపు నారాధించుట సేవకునకు సకల పురుషార్థ సంపను సమృద్ధిఁగ కలిగించునో అట్టి మురారి హృదయేశ్వరివైన నిన్ను వాక్కాయ మానసములతో సేవించెదను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
వరలక్ష్మీ దేవికి పాదాభి వందనములు నిజంగా మేలిమి బంగారం మన సంస్కృతి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.