గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జూన్ 2017, గురువారం

పద్య పక్షమ్ ఛందస్సు ( 9 ) యతి ప్రాసలు . . . మతాంతరములు

జైశ్రీరామ్.
పద్య పక్షమ్ ఛందస్సు  ( 9 )
శ్రీ మదాంధ్రామృత పాన లోలులారా! పద్య రచనాభిలాషులారా! వందనములు.
ఇంతవరకు మనము
పద్య పక్షమ్. ఛందస్సు (1) లో శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము. - కృతి రచనకుఁ బ్రశస్త వారములు, గురు లఘువుల స్వరూపము,
పద్య పక్షమ్ ఛందస్సు ( 2 ) లో గణ స్వరూప నిరూపణము. గణముల కుదాహరణములు,
సూర్య - ఇంద్ర - చంద్ర గణములు వివరణ.
పద్య పక్షమ్ ఛందస్సు ( 3 ) లో యతులు యతికి పర్యాయపదములు.. స్వర యతులు . 
పద్య పక్షమ్ ఛందస్సు ( 4 ) లో . వ్యంజన యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 5 ) లో . ఉభయ యతులు.
పద్య పక్షమ్ ఛందస్సు ( 6 ) లో ప్రాసలు
పద్య పక్షమ్ ఛందస్సు ( 7 ) లో దశ దోషములు
పద్య పక్షమ్ ఛందస్సు ( 8 ) లో కావ్యాది గ్రాహ్య వర్ణ విచారము.
తెలుసుకొన్నాం కదా.
ఇప్పుడు తెలుసుకొనునది
పద్య పక్షమ్ ఛందస్సు ( 9 ) లో యతి ప్రాసలు . . . మతాంతరములు

యతి ప్రాసలు . . . మతాంతరములు
. (23) ఱావడి ఱ - ర లకు యతి. సులక్షణ సార సంగ్రహమున 159.
ధారుణి ఱావడి యనఁదగు
ఱా రేఫకు రేఫ ఱాకు హి వడిఁ దనరున్.
భారతము.
తంపును బెంపును గదుర ని
లింపులు వెఱఁగంది చూడ రిపు సైన్యములుం
గంపింపఁ దన బలంబులు
ఱంపిలిబట్టార్వ సింధురాజుందాకెన్
నీ రమ్య కీర్తినగుఁ నా
రారాజున్నలువ బలుగుఱాలుననంగన్.

. ర ల యతి. దీనిని అప్పకవి అగ్రాహ్య విరామమని చెప్పి తిరస్కరించెను. కాని
వబ లకు, లళలకు, లడలకు వలె రలలకు అభేద యతి ఒప్పుకొనక తప్పదు.
కస్తూరి రంగ కవి ఈ యతిని చెప్పి ఉదాహరనలు చూపెను.
రాజ కుమారుఁడేలంగఁగలఁడు శ్రీనాథును సునందన చరిత్ర.
లోకుల్ మెచ్చ వ్రతంబు నా తలఁపు తీరున్ శ్రీ కాళహస్తీశ్వర శతకము.
లీలా హాస్య కళా ప్రసంగముల నుద్రేకించి కాశీఖండము  6 - 206.
(17) - లకు యతి అభేద యతి .సు..సా.146.
వపయోరభేద యనియెడి
నెపమున ప ఫ బ భలు వాకు నేర్పున వడిగా
నుపమింప వచ్చుఁ గృతులం
దుపనిషదుచితార్థ సూక్తులొలసిన చోటన్.
లక్షణ విలాసము
రిత భువనార్ణవంబుతో వంక సరియె?
మ్య మణిరాజరాజితీ క్క సరియె?
లిత వీణా రవంబుతో క్క సరియె?
యనఁగను నభేద నామాఖ్య యతులు సెలఁగు.

. కార యతి. (అనంతుఁడు చెప్పెను)
కారముతో ఇ ఈ ఎ ఏలంగూడిన ల ళలకు యతి చెల్లును.
అతని వంశమువారతిధన లుబ్ధులై - కృత వీర్యు ధనమెలాఁ గ్స్తి సేసి. భారతము ఆది పర్వము  - 7 - 133
ఘృ పయోరాశి సంక్ప్తావధికమైన చంచత్కుశద్వీప జగతిఁ జేరి. కాశీఖండము 5 – 281.
క్ప్త పట్టాభిషేకమంగీకరించి. చంపూ రామాయణము  8 - 165.

. ఏవార్థక వడి.
సకల హితంబై  . . . . పండ్రెండవ పర్వం
కడున్ మేలనఁగ శాంతి ర్వము వెలయున్.
(పర్వంబు + అ పర్వంబ = పర్వమేవ - పర్వమ్ + ఏవ) భార.ఆది.158.

. సంయుక్త యతి - స్నాన శబ్దము. స్నాతో తాకి యతి.
స్నానమొనర్చి ధౌత పరి ధానముఁ గట్టి హర విలాసము 2 - 37.
స్నానమొనర్చి ధౌత పరి ధానములన్ ధరియించిరుక్మాంగద చరిత్ర  1 - 95.
స్నాన మహిమంబు భక్తి తాత్పర్య గరిమ (కాశీ ఖండము.)
స్నానంబు తీర్చి ధౌములైన వస్త్రముల్. (మత్స్యపురాణము.)

. కై యతి.
చతుర్థీ విభక్తి కై కయి ప్రత్యయములకు (కు +    కు + అయి) ఉభయ యతి చెల్లఁదగును.
దీనిని చతుర్థీ విభక్తి యతి అని చెప్పనగును.
నఘ మా మాను శకుని నాకై కడంగి.  భార. సభా.  2 – 174
వణుగఁ గల్పవృక్ష సురకై    శశాంక.  1 – 84
మలాపతిఁ గొల్తు ముక్తికై విభుననఁగన్నరస4 – 21.

. రు వడి
రి లకు ఋవళి చెప్పఁబడెను.
రు లకు యతి గూర్చిన కొన్ని ప్రయోగములు కానవచ్చుచున్నవి.
క్రూరార్ధ చంద్రాన్త్ర కృత్తోరుబాహులై   భాస్కర.రా.  1448 
పుండరీకనే//త్రుని నిజ ధామ వైభవ సమృద్ధికి   భాగ.దశమ స్కంధము. ఉత్తర5317.
మృదువైన చేతులు ముండ్ల పొదలు.   (కాళిందీ పరిణయము.)
గృహ ధర్మ నిరతులు కొనివచ్చి.   భోజరాజీయము  3 – 27.
రురు వర్ణ దేహంబు గ్వేదమునకు.   పండితారాధ్య చరిత్ర వాదప్ర.  - 523 పుట.
వు యతి. గో//వులను గణియింప ధాయును నోపఁడుభాగవతము ఉ. - 462.
కా //వునఁ జండాలుఁడు కాఁడు సందియములే దూహింప  ధర్మఖండ. పుట – 227.
దే //వునకుననుంగువాఁడనని యుత్సుకతన్వృషాధిప శతకము. - 98.
ల్లని డించి పోవుటయ భీతిల్లినవనాథ చరిత్ర. - 92 పుట.

. దడ  రఱ ప్రాసలు.
. - లకు ప్రాస - లక్షన దీపిక లక్షణ శిరోమణి మున్నగు వాటిలో చెప్పఁబడెను.
ఎఱ్ఱన హరివంశమున ర్వభాగమున ౯ - ౮౭ లో  కంసుని / - ధ్వంము.
నన్ని -  కుమారసంభవమున ౧౨ - ౧౬౯ లో  సియు - కేశా - కేశి.
హర విలాసము ౨ - ౧౧౧ లో సంసా  -   వంశం.
భా.రామాయణము యుద్ధ కాం.  వ్రేసియు - కీశులు.
పండితారాధ్య చరిత్ర . సితంబు జల్లి షో - శునెత్తివైచి.
భాగవతము ౨ - ౧౫౮. నాసాంగనాంగదృ - గ్భ్రూశిరోజ

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఛందస్సును వారం వారం శ్రమ దీసుకుని మాకందిస్తున్నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.