గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జూన్ 2017, శుక్రవారం

బ్రహ్మశ్రీ పేరి అప్పాజీ సంస్కృత పండిత ప్రకాండులకు విన్నవింపు.జైశ్రీరామ్.
ఆర్యులారా! నమస్సులు. మనలో సుమారు అందరికీ చక్కగా నేర్పేవారుంటే ఆన్ లైన్ లో సంస్కృతం నేర్చుకోవాలనే జిజ్ఞాస బలంగా ఉన్నది. మన కోరిక మన్నించ గలరని ఆశిస్తూ బ్రహ్మశ్రీ పేరి అప్పాజీ గారికి ముఖ పుస్థకము ద్వారా విన్నవించుకొన్నాను. మీరూ తిలకించి మా సమ్మతిని వ్యాఖ్యలద్వారా తెలియఁ జేయఁ గలరని ఆశిస్తున్నాను.
బ్రహ్మశ్రీ పేరి అప్పాజీ సంస్కృత పండిత ప్రకాండులు.
బ్రహ్మశ్రీ పేరి అప్పాజీ సంస్కృత పండిత ప్రకాండులకు నమస్కృతులు.
ఆర్యా! శుభోదయమ్. ఇది ప్రజ పద్యం తరపున నా వునుతి. మన్నించ గలరని ఆశించుచున్నాను.
శా. గీర్వాణాంధ్ర సుబోధకాగ్రమణిగా కీర్తింత్రు మిమ్మందరున్.
నేర్వన్ సంస్కృత భాషనుత్సుకతతో నిత్యంబు శోధించువా
రుర్విన్ బెక్కురు, మీదు బోధనలచే నొప్పారు సత్ సంస్కృతిన్.
పర్వంబే సతతంబు మీదు కృప నప్పాజీ కృపాసాగరా!
వారములో ఒక్కరోజు మీరు ప్రణాళికా బద్ధంగా మాకు బోధించండి మిగిలిన ఆరు రోజులు మిమ్ములననుసరించి సాధన చేస్తాము. ఈ విధంగా సమ్స్కృత భాషాభ్యసనం ద్వారా మన జాతిలో జవసత్వాలు పుంజుకొంటాయని నా విశ్వాసము.
ఇందుకు ప్రజ పద్యం వేదిక చాలా అనువైనదని నా భావన. ఎడ్మిన్స్ కూడా నా మాట మన్నింతురని నా నమ్మకము.
వినమ్రతతో
విన్నవించుకొనుచున్న
భవదీయుఁడు
చింతా రామకృష్ణారావు.
9247238537.
భాగ్యనగరము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఒక భాషను నేర్చుకో వాలన్న ఆశక్తి భాషాభి మానులందరికీ ఉంటుంది.తప్పక నేర్చుకోగలము .దయచేసి మా కోరికను మన్నించి బ్రమ్మశ్రీ పేరి అప్పజీ పండితులవారు తప్పక నేర్ప గలరని ఆశిస్తున్నాము . కృతజ్ఞతలతో . సెలవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.