గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జూన్ 2017, శుక్రవారం

అజరామరవత్ ప్రాజ్ఞో . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థంచ సాధయేత్.
గృహీతయివ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్.
గీ. ముసలితనమును మృతియునుపొందననుచు
ధనము విద్యయు సాధించి మనుట శుభము.
మృత్యు ముఖముననున్నట్లు నిత్యమునిలను
ధర్మవర్తన మెలగుట ధర్మమర్తయ.
భావము. మానవుఁడు ముసలితనము మృత్యువు లేనివాని వలె విద్యను ధనమును సంపాదింపవలెను. మృత్యువు తన జుత్తు పట్టుకొని తనను చంపుచున్నట్లు భావించి ధర్మాచరణమును అవశ్యము చేయవలయును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ధర్మాచరణమును గురించి చక్కని శ్లోకమును అందించారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.