గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జూన్ 2017, ఆదివారం

హరశ్చ బహురూపశ్చ, (ఏకాదశరుద్రులు) మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
ఏకాదశరుద్రులు
శో. హరశ్చ బహురూపశ్చ, త్ర్యంబకశ్చాపరాజితః
వృషాకపిశ్చ శంభుశ్చ, కపర్దీ రైవతస్తథా
మృగవ్యాధశ్చ శర్వశ్చ, కపాలీ చ విశాంపతే
ఏకాదశైతే కథితా, రుద్రాస్త్రిభువనేశ్వరాః.(హరి వంశము 1-3-51; 52)
గీ. హరుఁడు, బహురూపుఁడు, జగన్నిరుపమేయ
త్ర్యంబకుఁ, డపరాజి,కపర్ధి, రైవతుండు,
శంభుఁడును, మృగవ్యాధుఁడు, శర్వుఁడును, క
పాలియును వృషాకపిరుద్రులేలు జగతి.
భావము
 1.హరుడు
 2.బహురూపుడు
 3.త్ర్యంబకుడు
 4.అపరాజితుడు
 5.వృషాకపి
 6.శంభుడు
 7.కపర్ది
 8.రైవతుడు
 9.మృగవ్యాధుడు
10.శర్వుడు
11.కపాలి
అను పదునొక్కండ్రు రుద్రులు ఈ జగతిని ఏలుచుండిరి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జగతి నేలు ఏకాదశ రుద్రులను చక్కగా తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.