జైశ్రీరామ్.
క. ఈ మిషతో నాంధ్రమ్మున
కామితములు తీర పద్య కవుల కవనముల్
ప్రేమను పంపిన వేతురు
శ్రీమంతపు పద్య పక్ష చిద్గ్రంథమునన్.
క. బహుమతులందఁగ వచ్చును
మహిమాన్విత కవులు రాచ మర్యాదలతో.
నహరహము దీని నడపఁగ
సహృదయ పటువర్ధనాళి సకలము చూచున్.
క. తప్పక వ్రాయుడు పద్యము
లొప్పుగ. సత్ కవులు మీరలో ఘనులారా!
ఇప్పుడె వ్రాయుట మొదలిడి
గొప్పగ పంపుడు ముదంబు కొల్పుఁడు కృపతోన్.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.