జైశ్రీరామ్.
మహిమాన్విత హరినామామృత పాన లోలులారా!
సమస్త వ్రతముల కంటెనూ కూడా హరి నామము ఉత్తమమైనది.
శ్లో: సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుంఠనామ గ్రహణ మశేషాఘహరం విదు: (భాగవతము 6-2-14)
గీ: ఐహికంబుల కాశించి హరిని పలుక,
హేళనముఁ జేయ నితరుల పలుక హరిని,
గానమును చేయ, నశ్రద్ధగా హరి యన
అట్టి వారల పాపాళి యిట్టె పోవు.
భావము: ప్రాపంచిక ఫలితములనాశించి గాని ఇతరులను హేళన చేయు ఉద్దేశ్యముతో గాని, గానము చేయవలెనని గాని, ఆశ్రద్ధతో గాని వైకుంఠుని నామమును ఎవరు ఆశ్రయించుదురో, వారి అశేష పాపములు హరింపబడును. ఈ విషయమును శాస్త్రవేత్తలగు భాగవతోత్తములు తెలిసికొని ఉన్నారు.
జైహింద్.
Print this post

1 comments:
నమస్కారములు
హరి నామ మహత్యమును వరుసగా ప్రచు రించి మాకందించిన సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.