గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2013, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి. 138.

జైశ్రీరామ్.
శ్లో: మాతాచ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః.
బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్.
గీ: పార్వతీ దేవి మా తల్లి భక్తి కొలుతు.
పార్వతీ పతి మా తండ్రి  ప్రాణ మతఁడు.
శివుని భక్తులు బంధువుల్  ప్రవర సఖులు.
త్రిభువనమ్ములు నా దేశ మభవునాన..
భావము: దేవదేవి పార్వతియే మా తల్లి. దేవాది దేవుఁడైన మహేశ్వరుఁడే మా తండ్రి. ఈశ్వర భక్తులెల్లరూ మా బంధువులే. ఈ మూడు లోకములూ మాకు స్వదేశమే అన్నారు శంకర భగవత్ పాదులు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకర భగత్పాదులు అనడమె కాదు ముఖ్యం గా మనం అని తీరాలి అది నిజమైన నిజం గనుక . చాలా మంచి విషయం .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.