గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2013, శుక్రవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 136.

జైశ్రీరామ్.
శ్లో: యావచ్చ వేద ధర్మాస్తు, యావద్వై శంకరార్చనం
యావచ్చ శుచి కృత్యాది తావన్నాశో భవేన్నహి.
గీ: వేద ధర్మ ప్రమాణంబు మేదినిపయి
నెంత వరకీశ్వరార్చనదెంత వరకు
నెంత వరకు సత్ సుచి కర్మ లెలమి నుండు
నంతవరకును జగముండు నంతమవక.
భావము: ఎంత వరకు వేద ధర్మములు ప్రమాణములుగా నిలిచి యుండునో, ఎప్పటి వరకు ఈశ్వరార్చన ఉండునో, శుచికర్మ లెంత వరకు ఉజ్జగింప బడవో అంతవరకున్ను ఈ లోకమునకు నాశము లేదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవును దైవా రాధన ధర్మనిరతి ఉన్నంత వరకు ఎన్ని ఆటంకములు వచ్చినా కొంత వరకు శుఖ శాంతులను పొంద వచ్చును కానీ ఈ రోజుల్లో అది ఎంతవరకు ఆచరణీ యము అన్నదే పెద్ద ప్రశ్న

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.