గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2013, శుక్రవారం

ప్రపంచ తెలుగు మహాసభలలో నా ఉపన్యాసంలో చోటు చేసుకున్న నేను రచించిన చిత్ర కవితలు.

జైశ్రీరాం.
గోపురభంధకందము.
శ్రీయే కరుణన్ వరముగ  -  నీ యోగము  నిచ్చె మనకు. నిల తెలు గను సు
జ్ఞేయ మధువులు గొనుడనుచు  -  న్యాయోద్భాస తెలు గే మహా ఘనమెన్నన్ !
నక్షత్ర బంధ కందము:- ( మధురమగు  జాను తెలుగు)
మన సుధ, నుతుల తెలుగు నే  -  ని జనులు కలుగు ! మది గులు. విన జా
లను. నుతమౌ మధురాక్షర  తెనుగు లులివడె.  తెలుగు దిగ జారుటయా?
శ్రీ చక్ర బంధ తేటగీతి
వెఱపు బాపరా! శ్రీ ధరా!  వేడుదింతె!  -  గజ సురక్షకా! శ్రీశ! నిన్  గాంచగాను
యజ్వ కాలేను. శ్రీ మనోహార్య! మేలు  -  వెలుగజేయగ తెల్గును వేలుపీవె.
చతురంగ బంధ కందము.

ప్రగణిత సుకవుల వసుధను  -  పొగడుడయ, మధుర కవికుల బుధు రహి కృపలున్
తగు కమల నయను గతి విన  -  నగు. మధు కవితలు తెలుగున నసదృశము కనన్.
ఛురికా బంధ కందము
శ్రీని గనితిని శుభాక్షిని  -  ధీనిధిని తెలుంగు భాష తేజమునందే.
దేనికి నింతటి కాంతి? సు   -    ధీ నిధి మనకబ్బె నెలమి. దివ్యము కాదే?

. శుభ కరముఁగ జరిగిన యీ - సభలోని ప్రపంచ తెలుగు సభికులకెల్లన్
శుభమగు కావుత! వేంకట - విభు దీవన లందు గాత విరివిగ నెపుడున్ .
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులకు సాధ్యం కాని దేముంది ? " గొపుర , నక్షత్ర , చక్ర , చతురంగ ,చురికా , బంధములు , విన సొంపుగా , శ్రోతలను అలరించి ఉంటాయి. అదృష్ట వంతులు . అందునా తిరుమ లేశుని సన్నిధిలో మరింత వెలుగు విరజిమ్మడం ముదావహం.బ్లాగులో మాకందించి నందులకు ధన్య వాదములు పండితులు శ్రీ చింతా వారికి హృదయ పూర్వక శుభాబి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.