గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2013, మంగళవారం

ప్రపంచ తెలుగు మహా సభలు అత్యద్భుతంగా జరిగాయి. అందరికీ శుభాకాంక్షలు

జైశ్రీరామ్.
సహృదయ సన్మిత్రులారా! ఆ పరమాత్మ ఎల్ల వేళలా సజ్జనులైనమీకు, మీ వంటి వారికందరికీ అండగా ఉండి, నిరాఘాట సత్ప్రయత్నసాఫల్యత ప్రాప్తింప చేయు గాక. అందరికీ శుభాకాంక్షలు
మీ అందరి అభినందనలతో తే.29-12-2012  మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో నిర్వహించిన 4వ ప్రపంచ తెలుగు మహా సభ - సాహిత్య ఉప వేదికపై " చమత్కారములు - చాటువులు " అనే అంశముపై నేను ప్రసంగించాను. మన సాహితీ మిత్రులు అనేక మంది శ్రమతీసుకొని ప్రత్యేకించి వచ్చి, అన్ను అభినందించి వేదికకు పంపించటం నాకెంతో సంతోషం కలిగించింది.వారందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ్ జేసుకొనుచిన్నాను. ఛాయా చిత్రములు కూడా ఆ విధంగా వచ్చిన ‘భాగవత గణనాధ్యాయి’ శ్రీ సాంబశివ రావు గారు తీసి నాకు పంపి యున్నారు. వారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఛాయా చిత్రములను జతచేస్తున్నాను.
జైహింద్.


Print this post

5 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అభినందనలు. వీలుంటే మీ ప్రసంగ పాఠమునిక్కడ ఉంచగలరు.

vsrao5- చెప్పారు...

ప్రపంచ మహా సభలలోని చర్చలో మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. అభినందనలు

మారెళ్ళ వామన కుమార్ చెప్పారు...

చింతా వారికి నమస్సులు. అభినందనలు. మీ ప్రత్యుత్తరానికి ప్రత్యేక ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

మీకు నా హృదయపూర్వక అభినందనలు. ప్రసంగ పాఠాన్ని ‘ఆంధ్రామృతం’లో ప్రకటించవలసిందిగా మనవి.

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

శ్రీ రామకృష్ణారావు గారికి
హృదయపూర్వకాభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.