మేథా శక్తిని`నమ్ముకొని పొట్ట చేతితో పట్టుకొని, బంధువులందికీ దూరంగా బ్రతుకు ప్రయాణం సాగించడం కోసం భారత మాత ముద్దు బిడ్డలు తమ మాతృ భారతిని కూడా విడిచి వెళ్ళ లేక వెళ్ళ లేక అమెరికా లాంటి దేశాలకు కష్టపడి సంపాదించడం కోస వెళ్ళితే అక్కడ అమానుషంగా హతమారుస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయాయి.
మన ఆంధ ప్రదేశ్ కు చెందిన వారే హతులలో ఎక్కువ మందివుండడం శోచనీయం.
హైదరాబాదుకు చెందిన ఆంధ్రా యింజనీర్ 26 సంవత్సరాల వయస్సు వాడయిన విశాల్ నిన్ననే అమెరికాలో దారుణంగా హతమార్చ బడ్డాడు. చాలా బాధా కరమైన విషయమిది.
ఈ దురాగతాలకంతే లేదా? దీనిని ప్రశ్నించే వారే లేరా?
మనకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టైనా లేదా? అవమానంగా అనిపించడంలేదా?
అదే మన దేశంలో విదేశీయులను మనమెల్లాగ చూసుకొంటున్నాము? అపురూప అతిథులుగా భావించి ఎంతో గౌరవంగా చూసుకొంటామే! మరి ఆదేశంలో మన భారతీయులనెందుకు కిరాతకంగా చంపడం జరుగుతోంది?
అమెరికాలోనున్న మన భారతీయులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. మనదేశం నుండి అనేక మంది అనేక వ్యవహారాలపై అనేక దేశాలు వెళ్ళి వస్తూ వుంటారు. మరి రక్షణ లేకపోతేయెలాగ?
యావదాంధ్రులే కాదు యావద్భారతీయులతో పాటు యావత్ ప్రపంచానికీ ఆదర్శ ప్రాయమైన ఐక్య రాజ సమితి ఈ హత్యోదంతాలను ఖండిస్తూ తగు చర్య వెన్వెంటనే తీసుకోవాలి.
ఎందరు తల్లిదంద్రులు కడుపుకోతకు గురౌతున్నారో ఆలోచించాలి.
విశాల్ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నాను.
Print this post
Sree Bhagavatula Somannaa ZPHighSchool, Golden jubilee celebrations of
1974-75 SSC Batch, Dimili village.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 గంట క్రితం
6 comments:
సంతాపం ప్రకటించడం మనం చెయ్యగలిగిన మొదటి పని.
ఇదివరకూ, ఇప్పుడూ mugging ఘటనల్లొ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు చనిపోవడంతో మీరు ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్ళిపోయారుగానీ, ఇది (సబర్బన్)అమెరికాలో చాలా సాధారణంగా జరిగే తంతు అని విన్నాను.
చేస్తే గీస్తే అమెరికన్ ప్రభుత్వమే ఏమైనా చెయ్యాలి. అంత్యక్రియలకోసం శవాల్ని భద్రంగా తెప్పించడంతప్ప మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేసేదేమీ ఉండకపోవచ్చు.
అమెరికాలో వలసవాదులు, ముఖ్యంగా భారతీయులు ఎక్కువ అవుతున్నారు. అందులో తెలుగువాళ్ళు ఉన్నతోద్యాగాలు చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని కొందరు అమెరికన్లు 30 రాష్ట్రాలలో Save Our US అనే పేరుతో ఒక ముఠా తయారు చేసి తెలుగువారిపైన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. 2030 నాటికి ఆంధ్రులను అంతం చేయాలని వీరి అజెండా.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటారూ?
రామకృష్ణరావు గారు,
మహేష్ గారు చెప్పినట్టు అమెరికాలో పట్టణాలలో కొన్ని చోట్ల mugging జరగడమనేది చాలా సాధారణం. ఒక ఆంధ్రా వ్యక్తి దానికి బలికావడం చాలా విచారించదగ్గ విషయమైనా అది యాధృచ్చికం. దానికి అమెరికా గాని, ఇండియాగాని చేయగలిగిందేమీలేదు.
నేను వరంగల్లులో చదువుకుంటున్నప్పుడు, Hunter Road అనే ఒక వీధి చాలా నిర్మానుష్యంగా ఉండేది. రాత్రి ఎవరూ అటువైపు వెళ్ళేవారుకాదు, మరీ అవసరమైతే తప్ప. మాతో పాటు ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఒక జింబాంబ్వే విధ్యార్థి ఒక రోజు రాత్రి ఆ రోడ్డుమీద వెళుతూంటే ఎవరో అతనిని ఇటకలు కర్రలతో కొట్టి జేబులోని దబ్బులు లాగుకుని పారిపోయారు. అప్పుడు జింబాంబ్వే ప్రభుత్వం దానిని పెద్దవిషయం చేసి ఉండుంటే ఎలాఉండేది??
మహేష్ కుమార్జీ!
అమెరికాలో సబర్బన్ లో హత్యలు విషయంలో సర్వ సాధారణమే. అలాగని అసలు అందరం పట్టనట్టుంటే బాధితూ ఏకాకైపోతారండి. పోయినవారిని తీసుకు రాలేము. వున్నవారికైనా ధైర్యాన్ని యిచ్చినవాళ్ళమవతాంగదండీ.
ఆర్యా!
మీరుచెప్పినట్లుగా అమెరికాలో " సేవ్ అవర్ యుయస్ " అనే పేరుతో ముఠా తయారై 2030 నాటికి ఆంధ్రులను అంతం చెయ్యాలనే అజెండా తో ప్రణాళికను సిద్ధం చేస్తుంటే మనవారు అప్రమత్తంగా వుండవలసి వుంది. మనం మన వారికి హెచ్చరిక చేయవలసివుంది. ఆ తరువాత విధి విలాసం ఎలాగుంటే అలాగ జరగక తప్పదు కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.