ఆ:-
చలన శక్తి కలదు. జంతువు కాదది.
చేతులెపుడు త్రిప్పు శివుడు కాదు.
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును
దీని భావమేమి తిరుమలేశ?
పై పద్యంలో ప్రశ్నకు సమాధానం తెలియదనుకొంటే దీని దిగువనే తెలుపు రంగులో కలిసిపోయివున్న సమాధానం మౌస్ సహాయంతో మీరు తెలుసుకో వచ్చునని మనవి చేయుచున్నాను.
సమాధానం:-
గడియారము.
ఇంతకు మించిన అత్యద్భుతమైన కొంటె ప్రశ్నలపద్యాలు మీ దృష్టిలో కూడా వుండకపోవు. మీరు కామెంట్ ద్వారా పంపినట్లయితే ప్రచురించగలనని మనవిచేయుచున్నాను.
జైహింద్.
Print this post
8 comments:
తే. టిక్కు టిక్కని తిరుగును దిక్కులన్ని
తన్ను కనునందరు, కనదు తానెవరిని
గంట గంటకు తప్పక గంట కొట్టి
వసుధ గడియారమను పేర వాసికెక్కె!!
fan?
ఆర్యా! జిగురు సత్యనారాయణ గారూ!
అభినందనలు. ధన్యవాదములు.
ఆటవెలది:-
జిగురు సత్యనార్యు శేముషీ విభవంబు
తేటగీతిలోన తెల్లమయ్యే
పాద పాద మందు ప్రకటించె వివరణ.
పద్య రచన పైన పట్టు చూపె.
ఆర్యా! నారాయణ స్వామీ!
అభినందనలు. ధన్యవాదములు.
ఆటవెలది:-
క్రొత్త పాళి గాన క్రొంగ్రొత్త భావంబు
తెలియ జేసె మనకు తృప్తి గొలిపె.
పట్ణ వాసులిండ్ల పగలు,రాత్రియుకూడ
తిరుచుండు ఫేను. తెలియదగును.
"fan" anukunnaanaMDI!
mI SIrshi adButaMgaa unnadi.
poDupu kathalanu miiku paMpavachchunaa?
"fan" anukunnaanu modaTa.
aanaka ardhamainadadi yoka "gaDiyaara"mmani.
I Siirshika baagunnnadaMDI!
ప్రియ అజ్ఞాతా!
కందము:-
అజ్ఞాతగ సుజ్ఞాతవు
విజ్ఞతతో పలుకనేర్చు విబుధోత్తముడా!
సుజ్ఞేయము మీ మది. ర
సజ్ఞులగుట నెఱుగ గలిగె . చక్కగ నుండెన్.
ఝనూర్య్ 28, 2009 9:22 ఫం
శి - క్షణలను పొంది శేముషీ వరులంద
రి - ట్లు పలుకు చుండె .నిపుడు పౌరు
ష - మును జూపి నిజము చక్కగా చెప్పుచు
శ్రీ - కరముగ నిలిచె. చేవ జూపి.
అజ్ఞాతా!
తప్పకుండా పంపండి.
మీరు పంపే ఆ
పొడుపు కథలకోసం సాదరంగా
ఎదురు చూస్తున్నాను.
చింతా రామక్రిష్ణారావు గారూ,
ఒకసారి jnanakhadga@gmail.com కి ఒక టెస్టు మెయిలు పంపగలరా?
యోగి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.