నరసింహ: తెలుగు భాషాభివృద్ధిమాలతీ మాధవం లో నరసిం హ గారు తెలుగు భాషాభివృద్ధిని గూర్చి తీసుకోవలసిన చర్యలను సూచించారు. ఆ సూచనలు 12.
అందులో మూడవ సూచన మినహాయిస్తే అన్నీ అనుసరణీయమే.
వారి బ్లాగులో వ్యాఖ్యానం వ్రాయడానికి అవకాశము దోరకక వారితో ఎలా లింకవాలో తెలియక ఈ బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.
మనకు కావలసింది జ్ఞాన సంపద.
జ్ఞానమనేది భాషతో నిమిత్తం లేనిది.
ప్రపంచంలో జ్ఞాన దూరమైన భాష వుంటుందని నేననుకోను.
నేటి కాలమాన పరిస్తితుల కనుకూలంగా మనం కూడా ముందడుగు వేయకుండా ఇది నాభాషలో లేదు, నేను నేర్వను అని అనుకొంటే ఈ రోజు ఈ బ్లాగులద్వారా స్వేచ్ఛగా బ్లాగే ప్రవృత్తి మనకు లభించేదా?
మన కోరిక ముఖ్యమైనది ఏమిటంటే
ఏ భాష నేర్పడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొన్నా మనకు అభ్యంతరం కాదు.
ఐతే మన మాతృ భష తేలుగును నిర్లక్ష్యం చేయవద్దు. మనకు గల అనంత సాహితీ సంపదకు మనలను దూరము చేయకుండా పాఠ్యభాగాలలో నరసిం గారు సూచించిన సూచనలన్నీ గ్రహించి అనుసరించాలి
అదీ మన ఆకాంక్ష.
తేటగీతి:-
తెలుగు భాషాభివృద్ధికి తెలిపినట్టి
పదియు రెండింట మూడును వదిలిపెట్టి
తక్కుగలవన్ని తప్పక నిక్కవముగ
చేర్చి చర్చింప నర్హమౌన్ శ్రీ నరహరి!
కందము:-
లోకముతోపాటుగ మరి
పోకుండుట నెఱుగమేని పూర్ణ జ్ఞానం
బేకరణి పొందగానగు?
శ్రీకరమగు తెలుగుకూడ చేర్పగ వలయున్.
కందము:-
ఆంగ్లము వలదన తగదయ.
ఆంగ్లముతో పాటు మనకునాంధ్రము వలయున్.
ఆంగ్లము నాంధ్రమువలెనూ.
ఆంగ్లముమువలె నాంధ్రభాష నరసిన శుభమౌన్.
కందము:-
తప్పుగ భావింపకుడీ.
యిప్పట్టున లోక గతులనెరుగకయున్నన్
ముప్పని తలతును.మనకిక
తప్పెడిదేముండె?కనుక తప్పదు నేర్వన్.
{ ఆంధ్రామృతము బ్లాగ్ }
Print this post
సౌందర్య లహరి 41-45 పద్యాలు. రచన శ్రీ చింతా రామకృష్ణారావుగారు,సంగీతం,గానం
శ్రీమతి వల్లూరి సరస్వతి
-
జైశ్రీరామ్.
41 వ శ్లోకము.
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యాముదయ విధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే జన...
9 గంటల క్రితం
2 comments:
ఈ చర్చ అంతా బాగుంది. మూడోది అనుసరణీయం కాదని ఎందుకు అనుకుంటున్నారు? వివరించ గలరు.
మూడవది 7వ తరగతి వరకు తెలుగు ంత్రమె ఉంచాలనేది .
దీని వలన మన జ్ఞాన వృద్ధి కుంటు పడుతుందని.
ఈ విషయం వివరంగా పద్యాలలో నిక్షిప్తం చేశాను. ఇది కేవలం నా అభిప్రాయంగా మాత్రమే గ్రహించ గలందులకు మనవి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.