గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2009, మంగళవారం

హిమాలయాల్లో ఉచిత యోగా శిక్షణ.

ఉచిత యోగా శిక్షణ.

హిమాలయ పర్వతాల్లో వున్న ఋషీకేష్ లోని శివానంద ఆశ్రమంలో మార్చి 1వ తేదీ నుండి ఏప్రెల్ 31 వ తేదీ వరకు యోగా, వేదాంతాల్లో ఉచిత శిక్షణ యివ్వ నున్నట్లు ఆశ్రమం ప్రథాన కార్యదర్శి స్వామి పద్మనాభానంద వెల్లడించి నట్లు,

30 యేళ్ళ నుండి 65 ఏళ్ళు వయస్సు గల పురుషులు ఈ శిక్షణకు అర్హులనీ, శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారనీ,
ఆసక్తి గలవారు నెల 15 తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలనీ,

దరఖాస్తు ఫారాలను www.sivanandaonline.org వెబ్సైట్ ద్వారా పొందవచ్చనీ
రాజమండ్రీలో వెలువడే ప్రముఖ వార పత్రిక అయిన ప్రజా పత్రిక లొ 2వ పేజీలో 10-01-2009. వ తెదీన వార్తగా వ్రాశారు.

వివరాలను వెబ్సైట్ ద్వారా నిర్ధారణ చేసుకొని ఆసక్తి కలవారు ప్రయోజనం పొందగలరని ఆశిస్తూ, ఈ విషయాన్ని ఆంధ్రామృతం ద్వారా పాఠకులకు అందుబాటులోకి తెచ్చాను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.