మనమందరం మంచిగా యెలాగుండాలో ఈ క్రింది శ్లోకంలో చక్కగా వివరించ బడింది. చూడండి.
శ్లో:-
అహింసా సత్యమస్తేయం
అకామ క్రోధ లోభతా
భూత ప్రియ హితేహాచ
ధర్మోయం సార్వ వర్ణికః.
ఆ:-
హింస వీడి, పరమ హితము, సత్యము బల్కి,
ధ్యాస పరుల సొమ్ము కాస పడక
కామ క్రోధ లోభ కలుషిత మవకుండ
ప్రాణి కోటి మంచి బడయుతనుత!
భావము:-
హింస చేయకుండుట, సత్యమే పలుకుట, ఇతరుల ద్రవ్యమున కాశ పడకుండుట, కామ క్రోధ లోభములను జయించుట, సమస్త ప్రాణుల హితమునే మనసా వాంఛించుట, ఇవి యన్నియు అన్ని కులముల మనుజులునూ సర్వదా ఆచరించు చుండ వలసినట్టి సాధారణ ధర్మములు సుమా.
Print this post

జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.