మంచి వారి నోటి వెంట మంచి మాటలే వస్తాయంటారు. ఇది చాలానిజం.
మన పెద్దలు మనలను ఎల్లప్పుడు శుభాన్నే పలుకమంటూ చెప్పిన ఈ క్రింది శ్లొకాన్ని చూద్దాం.
శ్లో:-
భద్రం భద్ర మితి భ్రూయాత్
భద్రమిత్యేవవావదేత్
శుష్కవైరం వివాదంచ
న కుర్యాత్ కేనచిత్ సహ.
ఆ:-
శుభము శుభమటంచు శోభిల్ల పలుకుము.
వ్యర్థ భాషణంబనర్థమయ్య.
తగవు లాడరాదు తక్కిన వారితో
శుభము పలుకుటదియె సుఖము మనకు.
భావము:-
శుభము శుభము అనే మంచి మాటలనే పలుకు చుండుము. వృథా వివాదములను, తగవులను ఎవ్వరి తోడనూ పెట్టుకొన వలదు.
చూచాం కదా! ఎంత చక్కని మాటలో. మనం ఎప్పుడూ శుభాలే మనకు జరగాలని కోరుకుంటాం కదా! తథాస్తు దేవతలు మనమేదంటే అదేమనకి జరగాలని దీవిస్తుంటారట. అందుచేత మనం యెల్లప్పుడూ శుభాన్నే పలుకుతూ, శుభాలలోనే జీవిస్తూ, నిత్యమూ శుభాకాంక్షలనే పరస్పరం చెప్పుకొందామా మరి?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.