గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 9.

tension
పూజ్య పాఠక మహాశయులారా!
మనం చాలా సాధన చేస్తూ వుంటాం. వ్యాసాలు వ్రాస్తున్నాం. వ్యాఖ్యానాలు వ్రాస్తున్నాం. పద్యాలు వ్రాసున్నాం. మనం పొందిన విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం కూడా సమస్యలకు పరిష్కార మార్గాలు తెలియజేయగలిగితే మన మేధాశక్తి క్షణ క్షణాభివృద్ధి అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రస్తుతం క్రిందనొక పద్యంలో
1) భారత మహిమను.
2) ఇక్షు ఖండ మహిమ.
3) సముద్ర మహిమ.

మూడింటినీ వర్ణిస్తూ ఒకే పాదంలో
అంటే
నాల్గవ పాదంగా మనం పూరించాలన్న మాట.
అన్నింటికీ సమాధానం ఒకటే అవాలి. సరిపోవాలి.
మనం చెప్పలేకపోవడమేమిటి?
ప్రయత్నం చేస్తే తప్పక సమాధానం వ్రాయగలం.
ఆ నమ్మకంతోనే ఈ పద్యం వ్రాశాను.
మీ మనసుకు ఆనందం కలిగిస్తుందనే నమ్మకంతో మీ ముందుంచుతున్నాను.

సమాధానాన్ని మీ వ్యాఖ్యల ద్వారా పంప వలసినదిగా మనవి.
పద్యంలాగ పూరించలేమనుకొంటే వచనరూపంలో వ్రాసి పంపండి.
ఆ పద్యాన్ని చూడండి.

ఆటవెలది:-
(1) భారతంబులోని భవ్యత్వమునుదెల్పు.
(2) ఇక్షు ఖండ మహిమ, కుక్షి యెఱుగు.
(3) అబ్ధి మహిమ తెలుపు మది ఒక్క పాదాన?
________________________. ( ఈ 4 వ పాదం మీరు పూరిచడం కోసం ఖాళీగా వుంచ బడింది. )

( నేను వ్రాసిన సమాధానము)BLOCKED.
పర్వ పర్వమందు ప్రబలు రసము. ( 4 వ పాదం )

ఓపికగా ఆలోచించే సమయం మీకు లేకపోతే సమాధానం వెంటనే తెలుసుకోవాలనుకొంటే నన్ను నిందించనక్కర లేకుండా నేను తెల్ల రంగు పులిమి పైన భద్ర పరచిన సమాదానిని మౌస్ సహాయంతో చూడగలందులకు మనవి.

జైహింద్.
Print this post

5 comments:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

"నాకమందు నిలుపునేక రీతి"

వివరణ:
1. భారతము చివరలో ఉన్నది స్వర్గారోహన పర్వమే.
2. చెఱకు రసాస్వాదన చేస్తుంటే, స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది.
3. వెళ్లి సముద్రము లో దూకితే.. ఇక సరాసరి స్వర్గానికే

కాబట్టి మూడు విషయలలోను ఏక రీతిన నాకానికిచేరు కోవచ్చు. నాకయితే "చెఱకు రసాస్వాదన" మార్గమే ఇష్టము మరియు సులభము. :-)))

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సత్య నారాయణ గారూ!
మీ భావన బాగుంది.
ఐతే ప్రశ్నను మీరు సరిగా చూడండి.
భారతం, చెరకు , సముద్రము వీటి గొప్పదనాన్ని ఒకే మాటలో గాని వాక్యంలో గాని, పద్యం చివరిపాదంగా నింపాలి. లేదా వచనంగానైనా తెలియజేయవచ్చు.

Sanath Sripathi చెప్పారు...

ellalerugani teepi moota, 'geeta'.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆటవెలది:-
శ్రీ సనద్ వరాఖ్య! చెప్పినమాటలు
సత్యమయ్య! చూడ నిత్యమయ్య!
ఎల్లలెరుగని పర మెల్లతెలియజేయు
గీత గీత మార్చు. ప్రీతి జదువ.

అజ్ఞాత చెప్పారు...

http://mandaakini.blogspot.com/2009/01/blog-post_29.html#links
అయ్య,
నెను ఉపర్యుక్త స్థలమునందు రాసి ఉంచిన సంస్కృత శ్లొకమును ఒక పరి పరిశీలించి, అర్థ దోషములున్న తెలుపగలరని ప్రార్థన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.