ఉ:-వేగిర పాటు కొంతయును, దృష్టికి లోపమదోక్క కొంత," యీ
రోగపు నెట్టు నన్ను మది రోయగచేయు" నదొక్క కొంత, నా
బ్లాగును దోషపంకిలము లంటగ జేసెను. ఇంకపైన నే
వేగిరపాటు వీడి, కను విందగునట్లుగ వ్రాయ బూనెదన్. .
.
Print this post
శ్రీసంహితతో శ్రీవైష్ణవి చేసిన ఉఅపయోగకరమైన వీడియో. Hidden Veg Pasta recipe
అమ్మమ్మ తో నేను (Ammamma Tho Nenu ) is live
-
జైశ్రీరామ్.
జైహింద్.
9 గంటల క్రితం
2 comments:
రామకృష్ణ గారు, మీరు తెలుగు లెక్చరర్ కనుక మిమ్మల్ని ఒక డౌటు ఆడగాలనుకుంటున్నాను.
హల్లుకి దాని కరెస్పాండింగ్ అనునాసికానికి యతిమైత్రి కుదురుతుందా?? అంటె, ఉదాహరణకి 'ప'కి 'మ'కి అలాగే 'థ'& 'న' కి యతిమైత్రి కుదురుతుందా??
దైవానికా! మీ ఉత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. మీరనుకొన్నట్టు అనునాసికాక్షరములతో ఆ వర్గ హల్లులకు యతి వేయవచ్చును. ఐతే ఆ హల్లులు అనుస్వార పూర్వకములై యుండాలి. ఉదాహరణకి ంక అనేకవర్గ హల్లుతో పంచమాక్షరమైన ఙ కు యతి వేయవచ్చును. ంచ ంఛ ంజ ంఝ లకి ఞ తో యతి వేయవచ్చును. మిగిలిన అన్ని వర్గులకీ ఇదే నియమం వర్తిస్తుంది. దీనిని బిందు యతి అంటారు. అనుస్వార పూర్వకం కానిచో యతి వేయరాదు. వర్గ యతులలోఅను స్వారాక్షరాలు చేరవు. మీకర్థమయేలా చెప్పగలిగేననుకొంటాను. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.