గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2008, శుక్రవారం

నిన్నటి సమస్యాపూరణలో చిన్న మార్పు

నిన్న నేనిచ్చిన సమస్యా పూరణలో చిన్న మార్పు. గమనించ గలరు.
సమస్య:-
శా :- ___రామా యన బూతు మాట యనుచున్ కాంతా మణుల్ తిట్టిరే.
నా పూరణ చూస్తారా?
శా:- చేరెన్ భక్తుడటంచు నమ్మి ముదితల్. శ్రీ కృష్ణ! శ్రీ పాండు రం
గా! రామా! యన. బూతు మాట యనుచున్ కాంతామణుల్ కొట్టి రే
తీరున్ బల్కగ రాని దౌష్ట్యములతో తిట్టన్. నిజంబే కదా!
చేరున్ సద్గుణు, భక్తి గొల్చు. చఱచున్. చీల్చున్ దురాత్మున్ బ్రజల్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.