"శరన్నవరాత్రులను గూర్చిన కవితలకాహ్వానం "
ప్రియ భగవద్ బన్ధువులారా ! వందనములు. శరన్నవరాత్రులలో మన ముంగిట కొలువై యుండెడి మన తల్లి దుర్గమ్మ
రోజు కొక స్వరూపంతో నలంకరింప బడడంలో గల ఆంతర్యం చదువరుల హృదయాలకు హత్తుకోనేలాగ ధ్వని ప్రధానంగా
పద్యాలలో ఆ యమ్మ ప్రత్యక్షం అవుతోందా అన్నట్లు వ్రాసి పంపగలందులకు మిమ్ములను ఆహ్వానిస్తున్నాను.
సీ:-శ్రీమన్ మహాభారతిన్ మానసంబందు-చింతించి పద్యాలు శ్రీకరముగ
వ్రాయంగ బూనుండు. ధ్యేయంబుపై చిత్త -మున్ నిల్పి శ్రీదుర్గ ముచ్చటలను
మీ భావనా లోకమున్ భక్తితో నిల్పి - మీ జ్ఞానమున్ జేర్చి,మేల్తరముగ
నాయమ్మ మాహాత్మ్య మాశ్చర్య మున్ గొల్ప- కావ్యాత్మ సంధించి ఘనతరముగ
గీ:-పద్యముల్ వ్రాసి పంపుడు ప్రతిభ జూప.
సద్యశంబును గనుడయ్య సహజ కవులు.
ఆంధ్ర కావ్యాత్మ ధ్వని యంచు నలర జేసి,
భక్తి నాంధ్రామృతంబిట్లు పంచుడయ్య !
సద్ విధేయుడు
చింతా రామ కృష్ణా రావు
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.