సనాతన సంప్రదాయాలకు సంగీత సాహిత్యాలకు మనం వారసులం. మన పూర్వీకులైన మహర్షులు, కవులు, ఎంతో శ్రమించి వ్రాసిన వారి కావ్యాలలో నిక్షిప్తంచేసిమనకందించారు.
ఆ గ్రంథాలను చదవడం ద్వారా మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడమే కాక మనల్ని మనం సంస్కరించుకొంటున్నాం. ఐతే కాలక్రమేణా సమయాభావం వల్లనైతేనేమి అలసత్వం వల్లనైతేనేమి నేర్పే దక్షడులేకపోవడం వల్ల నైతేనేమి ఆనాటి సంగీత సాహిత్యాలు, నృత్యాలు మృగ్యమైపోతున్నాయి .ఇలాంటి సమయంలో వాటిలోని జీవ కళను వెలికి తీసేందుకు ఎందరో మహాను భావులు పరిశ్రమించడం మనకు కనిపిస్తుంది. వారిచే నెలకొల్పబడిన సంగీత పీఠాలు సాహిత్య పీఠాలు నెలకొల్పబడటం మనం చూస్తూనే వున్నాం. అలాంటి దే విశాఖపట్టణం జిల్లా చోడవరం లో శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మి గారు నెలకొల్పిన శ్రీ అన్నమాచార్య సంగీత పీఠమ్. ఈ సంస్థ గత సంవత్సరం నెలకొల్పబడింది.ఈ సంస్థలో ప్రతి ఆఖారి ఆదివారం ప్రాచిన, ఆధునిక కవులలో ఒక రిద్దరిని గూర్చి వారి కవితా విశేషా లను గూర్చీ గోష్టీ కార్యక్రమం జరుపుతున్నారు. ౩౧-౮-౨౦౦౮ వ తేదిన కవయిత్రి మొల్ల ,ముద్దుపళని లను గూర్చి పలు అంశాలు చర్చించి కవయిత్రులు నిక్షిప్తం చేసిన కవితామృతాన్ని తెల్లం జేశారు .మొల్ల చెప్పిన ఒక పద్యం చూడండి .
ఆ:-తేనె సోక నోరు తీయన యగురీతి - తోడ నర్థమెల్ల తోచకున్న
గూఢ శబ్దములను కూర్చెడి కవితలు - మూగ చెమిటి వారి ముచ్చటగును .
చూచారా! ఎంతటి తేట తెలుగు పదాలలో ఎంతటి తీయని భావం వుందో .
సాహితీ చర్చా గోష్టి మనలోని అంతర్గత శక్తులను వెలికి తీసి మన లో గల సత్ సంప్రదాయ పరిమళాలను వెలువరించి గుబాళింప జేస్తాయి .
సంగీత సాహిత్యాలు రెంటినీ హస్తగతం చేసుకొన్న పూజ్యురాలు శ్రీమతి మంగిపూడి సుబ్బలక్ష్మిలాగా సంగీత సాహితి వేత్తలు వాటి అభివ్రుద్దకి కృషి చేస్తుంటే మన " ఆంధ్రామృతం "దాస దిశలా అందరికీ ఆనందామృత మౌతుంది.
ఆ:-అమృత భావాల నెలవైన యాంధృలార !
అష్ట కష్టాలలోనేల యలమటింప?
అమృత భావాలు కవితలి యలరజేయ
యత్నమోనరించి వ్రాయుడు నూత్న గతుల.
నమస్తే.
చింతా రామ కృష్ణ రావు.
ఆంధ్రామృతం.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.