తేది.౦౮-౮-౨౦౦౮.ఈ రోజును ప్రపంచ అక్షరాస్యతా దినంగా జరుపుకొంటున్న విషయం మనకు తెలియనిది కాదు. దాని
ప్రయోజనాన్ని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఎంతైనావుంది.
క్షరము అంటే నాశనము. అక్షరము అంటే నాశనము లేనిది అని అర్థం. అక్షర స్వరూపుడు ఒక్క పరమాత్మమాత్రమే.క్షయమైపోయే ఈ దేహంలో అక్షయ స్వరూపుడగు పరమాత్మ స్థిరుడైయున్నాడు. ఆ పరమాత్మను చూడాలి అనుకొంటే జ్ఞాన చక్షువుతోనే సాధ్యం.ఆ అన్తఃచక్షువు తెరుచుకోవాలి అనుకొంటే బాహ్య చక్షువులనే ఆధారం చేసుకోవాలి.ముఖే ముఖే సరస్వతీ అన్నారు కదా! అలాంటప్పుడు అందరినీ కలిసి విద్య ఎలా సంపాదించగలం? ఒక్క లిపి ద్వారామాత్రమే సాధ్యం . అందుకే ఇహ పర జ్ఞానం పొందాలి అంటే అది అక్షరాస్యత వల్ల మాత్రమే సాధ్యం.మనకు తెలిసిన భాషలో ఆభాషాక్షరాలు సరిపోతాయి. ఐతే ప్రపంచంలో అనేక భాషలున్నాయి. ఉద్గ్రన్థాలూ వున్నాయి. అన్ని భాశలూ నేర్చుకోలేము కాని సంస్కృతం మనం నేర్చుకోడానికి ప్రయత్నిస్తే మిగిలిన భాషలు సులభ తర మవతాయి. కంప్యూటర్
పరిజ్ఞానం కుడా అత్యవసరం. ముందు అక్షర జ్ఞానం సంపాదించి, పిదప ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అక్షరాస్యులను చేద్దాం.
క:-అక్షయ జ్ఞానామృతమది
అక్షర జ్ఞానంబుతోడనద్భుత ఫణితిన్
కుక్షిని నిలుచును గదయ్య!
శిక్షణ గొని నేర్పుడయ్య క్షేమము గొలుపన్.
చింతా రామ కృష్ణారావు .
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
1 comments:
అక్షరాస్యత శీర్షికలో కంద పద్యంలో మూడవ పాదంలో చివరి అక్షరం " యా " కు బదులు య క్రింద య పడింది. సరిచేసి ఇక్కడ వ్రాస్తున్నాను.
క:-అక్షయజ్ఞానామృతమది
అక్షర జ్ఞానంబు తోడ నద్భుత ఫణితిన్
కుక్షిని నిలుచును కదయా !
శిక్షణ గొని నేర్పుడయ్య ! క్షేమము గొలుపున్.
చింతా రామ కృష్ణా రావు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.