గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2008, శనివారం

ఉపాధ్యాయ దినోత్సవం


ఉపాధ్యాయ
దినోత్సవం చాలా బాగా జరు పుకున్నారను కుంటాను . విద్యార్థుల భక్తిప్రపట్టులు ఉపాధ్యాయలోకాన్ని మంత్రముగ్ధులనుచేయడంతోపాటు వారిపైగలగురుతర గుర్తుచేసినవి .డిగ్రీకళాశాల చోడవరమ్లో అద్భుతంగా జరిపారు.
ముఖ్యంగా యువ మైత్రీ సంఘం, చోడవరం వారు మండలం లోని ఒక 20 మంది ఉపాధ్యాయులకు చేసిన పూజ ఆ ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు తెప్పించింది. వేద మంత్రోచ్చారణతో స్వాగతం పలికి, ఉచితాసనంపై కూర్చోపెట్టి, సభకు వారిని పరిచయం చేసి, వారి పాదాలను పళ్ళెంలో పెట్టి కడిగి, దైవాన్ని పూజించిన విధంగా పూజించి, దుశ్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సూత్ర ధారి ఆ సమస్త కార్య దర్శి శ్రీమాన్ రేజేటి నరసింహాచార్యులు.
ఐతే సత్కారాలను పొందిన ఉపాధ్యాయ వర్గం వారి యోగ్యతను ఎలా నిరుపించుకొంటారో వేచి చూద్దాం.
చ:-గురుతరమైన బాధ్యతలు గుర్తును చేయుచు, మిత్ర సంస్థ సద్
గురువులటంచు కొందరికి కూర్మిని సత్కృతి చేసినార లా
గురువులు సద్ గురూత్తములు , కోరి భజిమ్పగ బోలనన్,మహిన్
గురువుల వర్తనల్ కలిగి, గొప్పగ రాజిల కాంక్ష సేయుదున్.
ఇట్లు
చింతా రామ కృష్ణా రావ్

Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రే జ్ఞాన ప్రసూనాంబా ! సార్థక నామధేయవమ్మా. మీకు నా వందనములు.
నా "ఆంధ్రామృతం " లోని పద్యాలు చదివి, స్పందించి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసి ఉత్సాహ పరచుచున్నందుకు మీకు నా ధన్యవాదాలు.
చ:-సురుచిర భావసంపదను సూక్తులయట్లు వచించుచున్న మీ
"సురుచి" ని గంటినమ్మ! మధు సూదను రాణివొ? బ్రహ్మ రాణివో !
బరువగుభావసంపదను పద్యములందు వచింప, మెచ్చుచున్ ,
ధర నను బంధువంటివిగ.! ధన్యుడ. జ్ఞాన ప్రసూన తల్లిరో !
నిరంతరం మీ ప్రోత్సాహమే ఆంధ్రామృతానికి అమృతత్వం సిద్ధింప చేస్తుంది. నమస్తే.
భవదీయుడు
చింతా రామ కృష్ణా రావు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.