గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

అన్నమాచార్య సంగీత పీఠం చోడవరం లో జాషువా సంస్మరణ సభ.












































శ్రీ గుఱ్ఱం జాషువా మహాకవి 28-9-1895వ తేదీన వినుకొండలో జన్మించారు.
తల్లిదండ్రులు :-లింగమాంబ, వీరయ్య.
రచనలు:-ఈయన రచించిన 7 ఖండ కావ్యాల్లో 200కు పైగా ఖండికలున్నాయి.అందు ముఖ్యమైనవి గబ్బిలము, పిరదౌసి, స్వప్నకథ, కొత్తలోకము, నేతాజీ, బాపూజీ, ముసాఫరులు, ముంతాజ్మహల్, కాందిశీకుడు, నాకథ, స్వయంవరం, రాష్ట్రపూజ, నాగార్జునసాగర్, క్రీస్తుచరిత్ర.
నవలికలలో చిన్ననాయకుడు.
నాటకాల్లో ధ్రువవిజయము, హిమదమార్కపరిణయము, చిదానందప్రభాతము, రుక్మిణీకల్యాణము, మీరాబాయి, తెరచాటు మొదలగునవి.
బిరుదులు:-నవయుగకవిచక్రవర్తి, కవికోకిల, మధురశ్రీనాధ, పద్మశ్రీ, కవితావిశారద, కవిదిగ్గజ, పద్మవిభూషణ, కళాప్రపూర్ణ. మొదలగు పెక్కులు గలవు.
సత్కారములు:-కనకాభిషేకము, గండపెడెరసత్కారము, పగలు దివిటీల మధ్య ఏనుగు అంబారీపై ఊరేగింపు మొదలగునవి.
ఈతని ప్రశస్థ ఖండ కావ్యము:- గబ్బిలము.
ఈరోజు జాషువా 113వ జయంతిని ఆంధ్ర పండితలోకం ఘనంగా జరుపుకొనివుంటుంది..
విశాఖపట్టణం జిల్లా, చోడవరం గ్రామంలో శ్రీ అన్నమాచార్య సంగీత పీఠం
నిర్వాహకులు శ్రీమతి సుబ్బ లక్ష్మి అక్కయ్య గారి ఆధ్వర్యవంలో అత్యద్భుతంగా యీ కార్యక్రమం జరిగింది. పలు దూర ప్రాంతాలనుండి కూడా పండితులు, కవితాపిపాస గలవారు వచ్చి పాల్గొన్నారు.
అపర గాంధీగా పేరు గడించిన శ్రీ దేవరపల్లి సన్యాసిరావుగారు మొదలుకొని డిగ్రీ చదువుతున్న విద్యార్థుల వరకు యీ కర్యక్రమంలో పాల్గొని కవితాగోష్టిలో పాలు పంచుకోవడం విశేషం. గుఱ్ఱం జాషువా కవిహృదయం సాక్షాత్కరింపజేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినిగా బిరుదు పొందిన శ్రీమతి వి. గాయత్రి గారిని ఈ సంస్థ ఘనంగా సత్కరించింది. ఇట్టి కార్యక్రమాలు మనలోని చైతన్యాన్ని వెలికి తీస్తాయి. విద్యార్థిని రేవతి కూడా గోష్తిలో పాల్గొని అందరి మెప్పులూ పొందింది.
ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ద్వార మహాకవుల రచనలలోని కవితా విశేషాలను తెలుసుకోవడమే కాక తద్వార ఉత్తేజాన్ని పొంది మనం కూడా మంచి కవిత్వం ద్వరా సమాజాభివృధికి తోడ్పడినవారమవుతాం.
మీ ప్రాంతంలో జరుపుకొనిన ఉత్సవాల్ని మాకు తెలియజేస్తే ఆంధ్రామృతం ద్వార పాఠక లోకానికి అందిచడానికి మాకు అవకాశంకల్పించినవారవుతారు.
నమస్తే
చింతా రామ కృష్ణా రావు.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.