"మాసే మాసే కవన విజయం."
ఆంధ్రామృతాస్వాదనా తత్పరులారా ! అపరిమితానందాన్నందించే ఆంధ్ర భాషామతల్లి మీద కవి పండిత గాయకాళికి ఎనలేని మక్కువ. అమృతోపమయిన మన భాష, సంప్రదాయాలు ,జగజ్జేగీయమానంగా విరాజిల్లాలంటే మన వంతు కృషి మనం చేయాలి.
ప్రతీ నెలా మొదటి ఆదివారం మనకు అవకాశం కల్పించుకొని పదిమందీ ఓక చోట చేరి మరో పదిమందిని చేర్పించి గోష్టీ కార్యక్రమం నిర్వహంచడం , ప్రముఖ కావ్యాలనుగూర్చి, ప్రముఖ కవులను గూర్చి, చర్చా కార్యక్రమం నిర్వహించడం లాంటివి తప్పక చేయాలి. వండేటప్పుడు అన్నమైనా కలపకపోతే అడుగంటిపోతుందికదా! భాష విషయంలో కూడా అంతే.
విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు " ఉప్మాక " గ్రామంలో 14-9-2008వ తేదీన జరింది. అంధ్ర రాష్ట్ర పద్యకవితా శాఖ అధ్యక్షులు శ్రీ కేశాప్రగడ సత్యనారాయణ గారు " పోతన భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం " వివరించి చెప్పారు.
అనేకమంది కవులు " కలియుగ దైవం " అనే అంశంపై స్వీయ రచనలను వినిపించారు.జిల్లాపద్యకవితాధ్యక్షులు శ్రీ కొట్టే కోటారావు, డా. ఎం. వెంకటేశ్వరరావు. శ్రీమతి గాయత్రి,డా. యల్లెస్వైవి శర్మ మున్నగు కవి పండితులే కాక శ్రీ దేవరపల్లి సన్యాసి రావు వంటి స్వాతంత్ర్య సమర యోధులు కూడా పాల్గొన్నారు. అక్కడ నాకయితే తెలుగు భాషామతల్లికి వసంతోత్సవం జరుపుతున్నట్లనిపించింది. సుమారు 3 గంటలు జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే భాషాభిమానులు అంతా ఇలాంటి కార్యక్రమాల్ని జరుపవలసిన అవసరం ఎంతైనావుంది.
మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ నామాటలు ప్రోత్సాహాన్నిస్తాయని నమ్ముతున్నాను.
జై హింద్.
చింతా రామ కృష్నా రావు.
{ఆంధ్రామృతం బ్లాగ్}
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.