గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2008, మంగళవారం

సర్వశిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ 147 వ జయంతి















21-9-2008వ తేదీన సర్వసిద్ధి రాయవరం గ్రామంలో " ఉన్నత పాఠ శాల ప్రాత విద్యార్థి సంఘం మరియు ఫ్రెండ్స్ & ఫ్రెండ్స్" సంస్థల ఆధ్వర్యవంలో శ్రీ గురజాడ వెంకటప్పారావు 147వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్ణం జిల్లాలో పలు గ్రామాలలో యీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
యస్.రాయవరం గ్రామంలో జరిగిన సభలో ప్రముఖ విద్యావేత్త శ్రీ ప్రాత రాజశేఖర్ ప్రసంగించారు.ఈనాటి సమాజాన్ని 100 సంవత్సరాలక్రితం ఆనాడే గురజాడ గుర్తించి, దేశమును ప్రేమించుమన్నా అని ఉద్బోధిస్తూ వ్రాసిన దేశభక్తి గీతం మనకందించారన్నారు. అతని ముత్యాల సరాలలోని, కన్యాశుల్కంలోని,సామాజిక స్పృహను, సంభాషణ లోని చమత్కారాల్ని, వివరించి చెప్పి, పండిత పామరులను రంజింపజేశారు.శ్రీమతి వి.గాయత్రి, మున్నగు ప్రముఖులు తమ ప్రసంగాలతొ శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారు.
అన్నిటికీ మించి యీ కార్యక్రమ నిర్వాహకులు అనేకమందిపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయదంతో పాటు, నిరుపేద మహిళలకు కుట్టు మిషనులందజేశారు.కారణ మేదైనా జరిపిన కార్యం మాత్రం అందరికీ హర్షణీయమే కదా! జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.