జైశ్రీరామ్.
సహృదయ శిరోమణి, చిత్రకవితాభిలాషి శ్రీ లోకనాథంగారు సనాతనధర్మసంస్థ చైర్మన్ గా స్థానమలంకరించి గౌరవింపబడుట మనకెంతయో ఆనందకరము.
శుభమస్తు లోకనాథంగారూ! అభినందనలు.
చం. హృదయనందు కల్మషమొకించుకయేనియు లేకయున్నచో
పదవుల కోరకుండకనె పర్విడివచ్చి వరించు, నమ్ముడీ!
పదిలము లోకనాథ! వరభక్తిని నిత్యము సేవచేయుచున్
హృదయములందు నిల్చుడయ! యీశ్వరి సత్కృప మిమ్ము కాచుతన్.
🌹🙌👍
జైహింద్.
వ్రాసినది












2 comments:
ధన్యోస్మి గురుదేవ
మీ ఆశీస్సులు సనాతన ధర్మ సంస్థ కోరుకుంటున్నది
మీ సహాయసహకారాలు మార్గదర్శనము మాకు అమూల్యము 🙏🕉️🌸
జగన్మాత కృపయే మిమ్ములను నడిపించగలదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.