జైశ్రీరామ్.
1.శా. శ్రీ మద్దివ్య రసాను భూతు లెలయన్ శ్రేయోభి రామంబునౌ రామున్ రమ్య గుణాభి రాము చరితన్ రమ్యంబుగా గూర్చిరే! నీమాలంకృత కావ్య రీతు లలరన్ నేర్పున్ సదా కీర్తిలన్ నీమంబౌ వర రామ మౌచు బుధతన్ శ్రీరాము నాశీస్సులన్.
2.సీ;-భానూష దయ కాల భాగ్యంబుగా నెంచి
కనులార చిత్రాలు కాంచి కాంచి,
మించిన మీ ప్రేమ మేథలో కదలాడ
రామ కృష్ణుని గాంచి రమ్య ధృష్టి,
పంచ రత్నాలలో ప్రణవ మోంకారంబు
రామ భీజ మహిమ రాజిలంగ,
శ్రీరామ మా రామ యోరామ రామంచు
భక్తితో నుతియించి పరగ దలచి,
తే,గీ:-కోర కుండక కృతి కేను కూర్మి కతన
వ్రాయు చుంటిని దీవించి ప్రణుతు లిడుచు
రామ తారక మంత్రంబు రహిని వెలుగ
జీవ ముక్తిని కాంక్షించి జీవ తతికి.
3.సీ;-ఏ జిహ్వ రాముని నింపార బల్కునో
యా జిహ్వ జిహ్వయౌ నరసి చూడ,
నే మనంబునకెన్ని యీ రామ మంటునో
ఆ మనంబదె సుమ్మ యవని మిన్న,
ఏ రామ కీర్తన యింపొంద శృతమౌనొ
ఆ మాన్యు జీవంబు హాయి గనును,
ఏ రామ శతకంబు యీరాము కృతి యౌనొ!
యా రామశతకంబు కోరి ప్రోచు,
తే,గీ;-రామ కృష్ణాఖ్య! రస రమ్య రాజ తిలక!
జన్మ జన్మల పుణ్య మీ జన్మ కాగ
భాష మాధుర్య శోధిత మాన్య చరిత!
చిత్ర గర్భ కృతి వధాన్య! శ్రీక ర మగు.
4.సీ:-ఊల పల్లి సు వంశ యుద్యత్ఘన సు కీర్తి
లలిత సాంభ శివుల లాల నమున,
రాఘవ శతకంబు రమ్యమై రహి నిల్చు,
కల్ప కల్పాంతముల్ కౌముదియన,
జన్మ సార్ధక మాయె, జగదేక రాముండు,
రామ కృష్ణుని మేథ సోమ మేర్చె,
రామ రామ యనగ రమ రామమౌ గదే?
రమణి సీతమ్మయే రక్ష కాగ.
తే,గీ:-జీవ సౌఖ్యంబు జేకూర్చి జీవ సరళి,
నిండు నూరేండ్లు భక్తి తా నెలకొనంగ,
శివుని భద్రత నెంచిన జీవి యేను,
సతత మాశీస్సు లందింతు శర్వు కృపను
5.సీ:-వెలుగైన తెలుగుకే విలువ తా పెంపేర్చి
విన్యాసములు జేయు వేద్యు డౌచు,
చిత్రాలు బంధాలు చిన్ముద్ర వేయించి,
ముద్రిత ప్రతులకే మోద మేర్చి,
గర్భ మర్మ మెరిగి, కంజాత సుమములు,
గర్భ కవిత పూజ కర్పి తమయె,
భావి తరములెల్ల బాగు తెల్గన బొల్చు
తెలుగు చేతలవెల్గ తీర్చి దిద్దు,
తే,గీ:-తెలుగు మాంథ్యంబు మందమై వెలిగె నేడు,
తేనె లొలికెడి తెన్గుకే తీపి వౌచు
రామ కృష్ణాఖ్యు శోధన దివురు భవిని,
తెలుగు భాషలందున లెస్స దీప్తి జగతి.
జైహింద్.
Print this post
వ్రాసినది
Labels:












0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.