గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2025, గురువారం

కాలక్షేపో నకర్తవ్యః,

జైశ్రీరామ్.

శ్లో.  కాలక్షేపో నకర్తవ్యః, క్షీణ మాయుద్దినే దినే I 

యమస్య కరుణానాస్తి, కర్తవ్యం హరి కీర్తనమ్ II

తే.గీ.  కాలయాపన చేయకు, కరిగిపోవు

చుండు నాయువుమనకిల, నుండబోదు

కరుణ యమునకు, గొనిపోవు కదలివచ్చు,

హరిని కీర్తించుచుండుమా నిరుపమగతి.

భావము.

మనము కాలమును వ్యర్ధముగా గడుపరాదు. రోజురోజుకూ మన ఆయుర్దాయము తరిగిపోవుచుండును. యమునకు జాలి ఉండదు. మనకాలము చెల్లగనే గొనిపోవవచ్చును. కావున నిరంతరము హరి సంకీర్తన చేయుచుండుము.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.