గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2025, శనివారం

ఏకాక్షర నిఘంటువు

జైశ్రీరామ్.

 - బ్రహ్మ,విష్ణువు, శివుడు, తాబేలు, ముంగిలి, యుద్ధము,
        గొప్ప తనము, అంత:పురము, హేతువు, భూషణము,
       పాదము, పార్వతి, యజ్ఞము, చంద్ర బింబము, గాయత్ర్యాది
       మంత్రము, చక్రము, కోడితల, బృహస్పతి, గాలి, సిగ, గుఱ్ఱము
       మొదలైనవి.
అ: - సిద్ధమంత్రము, సూర్యాశ్వము, చంద్రబింబము, కోడితల,
         పగ్గము, సిగ. బ్రహ్మ, నారాయణుడు, పరమేశ్వరుడు,
         ఒక రౌద్రబీజము, మృత్యునాశక బీజాక్షరము.
అమ్ - ఆకాశబీజము, విష్ణుబీజము, వృక్షబీజము, వంశీకరణ బీజము,
              హేతువు, భూషణము, స్వల్పము, త్వర, వంకర మాట, దోసిలి,
              అనుస్వారము, బిందువు, ముంగిలి, యుద్ధము,
              అంతిపురము, పాదము.
 - స్థానము, భావము, పరితాపము, బ్రహ్మదేవుడు, కోపము,
        తలంపు, వాక్యపూరణ, ఆక్షేపము, ఆశ్చర్యము, సంతోషము,
        వైరాగ్యము, ప్రభావము, సంబోధనము, బలము, కడవ, బరువు,
       పూజ, తాత, మంగళసూత్రము.
ఆ: - స్థానము, భావము, సంతాపము, బ్రహ్మ, శివుడు, కోపము,
          ఆక్షేపము, తలపు, అచ్చెరువు, సంతసము, విరాగము, ప్రబోధము,
          సంబోధనము, బలము, బరువు, కడవ, పూజ, తాత, మంగళసూత్రము,
         దుఖము, శమము, సదాచారము, ముఖము, ఉనికి.
ఆమ్ - అంగీకారము, స్మరణ, నిశ్చయము, జవాబు, పాశము,
               ఒక ఆకర్షణీయ బీజము.
ఙ్ - స్వల్పము. వరకు, గ్రహించుట, కప్పుట, పూరించుట,
            కోపగించుట, కౌగిలించుట, తిట్టుట, కోరుట, కాలక్షేపము,
            వేడుక, దగ్గర, వంచనము,  బంధము, నిరోధము, విరోధము,
            సంహారము, స్నానము, వాడుక, చూచుట, హద్దు, ఆలోచించుట,
            బుద్ధి, ఈవి, పరాధీనము, భూషణము, సంభాషణ, ఎదురు,
           ఆక్రమణము, జీవనోపాయము, మరుపు, నమ్మిక, ప్రయత్నము,
           భోజనము, సంబోధనము, పూజ, బడలిక, వాత్సల్యము, సంచయము.
 - పాము, రత్నము, కాంతి, ముందు,రహస్యార్థము,
        శివుడు, ఆడ ఏనుగు, అంతిపురము, చంద్రకిరణము,
       మన్మథుడు, చిత్రము, వంత, శబ్దము, మంట, అగ్రము,
       (ఆశ్చర్యము, భేదవాక్యము)
ఇ: - శివుడు, మన్మథుడు, చంద్రకిరణము, పాము, మణి, కాంతి,
         ఆడ ఏనుగు, గుహ, దుఖభావన, పరితాపము, కోపము,
         ఎదురు, ఇంటిలోపలిచోటు.
ఇమ్ - పుష్టినిచ్చుచు క్షోభరముకానట్టి ఒక బీజము.
 -  కోపము, దుఖము, లక్ష్మి, సరస్వతి, గౌరి, నాలుక,
          తామరఱేకు, కేసరము, బాణము, సర్పము, మొలనూలు,
         దయ, చింత, దగ్గర.
ఈ: -  లక్ష్మి, సరస్వతి, తామరఱేకు, నాలుక, ఇంద్రధనస్సు,
           గుహ, బాణము, పాము, కమల కేసరము.
ఈమ్ -  ఇది పిమ్మట, వాక్ప్రసాదకర నిర్మలబీజము.
ఉ: -  రాజు, నేత్రము, ఈశ్వర జటాజూటము, విష్ణువు, శివుడు,
          పిలుచుట, కోపము, అంగీకారము, అడుగుట.
ఉం - విష్ణువు, శివుడు, రాజు, కన్ను.
ఉమ్ - పురుషుడు, చంద్రుడు, రాజ పుత్రుడు, కంఠము,
             దేవత, ప్రాంగణము, సామ్యము, నిండుకడవ,
            వర్తకుడు, రక్షణము, బ్రహ్మ, గుర్తు, శివుడు,
            పోలిక, రక్కసుడు.
ఊ: -  శివుడు, పాలకుడు, చంద్రుడు,
            లక్షణము, రక్షించుట, బ్రహ్మ.
ఊమ్ -  నింద, క్రోధ వచనము, పోటి, ప్రశ్న,
                దుస్సహమైన, ఉచ్ఛాటన బీజము.
 -  ఏనుగు, శైలము, బుద్ధి భేదము, అదితి, స్వభావము,
            దేవశత్రువు, నది, మద్యము, బావ, మఱఁది, ఆకాశము,
           బొరియ, ఏవగింపు, (సమస్తము).
ఋ: -  స్వర్గము, దేవదూత.
ఋక్ -  ఋక్కు, ఒక వేదము, ఒక వేద మంత్రము, పూజ, స్తుతి.
 -  తేజస్సు, రాత్రి, ఉదకము, విష్ణువు, ఆకాశము,      
         మణిమధ్యభాగము, సన్నిధి, ఏవార్థకము, 
         సూర్యోదయకాలమునకు, పదకొండవ సంఖ్యకు,
         (దుఖ:భావనము, కోపము, ప్రత్యక్షము, సమీపము)
-  విష్ణువు
ఏమ్ - సర్వవశ్యకర శుద్ధ తత్త్వబీజము.
 -  హస్తము, దిక్కు, పర్వతశిఖరము, చర్మము,
          విష్ణువు, శివుడు, స్మరణము, ఆహ్వానము,
          నియంత్రణము,
ఐమ్ -  వాగ్బీజము, పురుషవశ్యకరము,
                 శుద్ధ సాత్వికమునగు బీజాక్షరము.
ఓ - కమలము, గోడ, ఉదకము, కుబేరుడు, చంద్రుడు,
          మేఘము, యోని, బృహస్పతి, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు,
          సందేహము, స్మరణము, మొల, పిలుచుట(సంబోధనము, 
         ఆహ్వానము)
ఓ:  -  బ్రహ్మ
ఓమ్ -   ప్రణవ బీజము, సమస్తవాఙ్మయరూపము,
                  నిత్య శుద్ధమునగు బీజము, ఈశ్వరుడు, స్వీకారము.
ఓం -  పరమాత్మ, ఆరంభము, మంగళము
ఔ  -  కుమారస్వామి, స్వచ్ఛమైన మేనికి పేరు, చంద్రకళ,
           సిద్ధులవిమానము, అనంతుడనే సర్పము,సంబోధనము, 
           ఆహ్వానము, విరోధము, నిశ్చయము.
ఔ:  - శబ్దము, అనంతుడు, భూమి.
ఔమ్ -  సర్వవాఙ్మయప్రదము, వశ్యకరమునకు ఒక బీజాక్షరము.
అం -  వక్రవాక్యము, అతిదీర్ఘము, ఆజ్ఞ, దోసిలి,
               సప్తస్వర కాలపరిణామము, పరమాత్మ,
               కారణము, కక్ష్య, అంతపురము, గౌరవము.
అ: -  సిగ, సిద్ధమంత్రము, సూర్యరథాశ్వము, నిర్బంధము,
             చక్రము, చంద్రబింబము, కోడితల, బ్రహ్మ, విష్ణువు,
             మహేశ్వరుడు.
 -   బ్రహ్మ, వాయువు, పరమాత్మ, అగ్ని, చిత్తము,
        సూర్యుడు, బుద్ధి, యముడు, నెమలి, విష్ణువు,
        సముద్ర వస్తువు, శ్వేత వర్ణం, సిగ్గు, తల, సుఖం,
        ఏడాది, తెలుపు, అడవి, ఆశ్చర్యం, పసుపు, నీరు.
క: -  విష్ణువు, చతుర్ముఖుడు, మన్మథుడు, అగ్ని, వాయువు,
          సూర్యుడు, యముడు, దక్షుడు, పక్షి, మేను, ఆత్మ,
          ధ్వని, బుద్ధి, నెమిలి,కాంతి, కాలము.
కం -  నీరు, సుఖము, శిరసు, బ్రహ్మము.
కిం -  ఏమని అడుగుట, నింద, ఆక్షేపణ, సందేహం,
              వికల్పం, దూఱు, నీతి, అడుగు.
కి  -  జ్ఞానం, ఎఱుంగుట.
కీ  -  నింద
కు  -  భూమి, కుత్సిత పాపము, కొంచెము, నివారించుట,
             నింద, రాయి, షష్ఠీ విభక్తి ప్రత్యయము.
కు: - భూమి, ఒకటి.
కూ: - పిశాచి.
క్రా:  - ఆక్రమించువాడు.
క్రీ: - కొనివాడు.
క్రీ - కాలికా, బీజము.
క్రోం - అంకుశ బీజము.
క్రౌమ్ - అంకుశ బీజము.
క్లీం - జగన్మోహన(కామ)బీజము.
క్ష   - అడ్డగించుట, విరోధము, క్షేమము,
           దుస్స్వప్నము,  క్షత్రియుడు, రక్కసుడు.
క్షం - పొలము, రక్కసుడు.
క్ష:  -  క్షేత్రము, వక్షస్స్థలము, వ్యాకరణశాస్త్రము.
క్షి:  -  క్షేత్రము, క్షాత్రసంరక్షణము, నరసింహస్వామి.
క్షా - ఓర్పు, నిద్ర
క్ష్మా - భూమి
 - విద్వేషకర మోహన బీజాక్షరము. ఊసరవెల్లి, పర్వతము,
           శరీరము, క్షేమంకరుడు, దేవత, విలాసగమనము,
           కన్ను, తల్లి, ఎముక, కద్రువ
 - కేవల మోహనకరమగు ఒక బీజాక్షరము.
 -  గరుత్మంతుడు, స్వర్గము,కత్తి, శాంతము,
          ఈచఁబోయిన కాలుసేతులు కలవాడు.
          బంగారు, మణి, కొంచెము, దీనుడు,
         సున్న, దవాగ్ని, నిశ్చయము.
ఖం - ఇంద్రుయము, ఆకాశము, స్వర్గము, సుఖము,
              నక్షత్రము, వరిమడి, పట్టణము, దయ, పలక,
             అభావము, గురుతైన బిందువు, ఉంచుట, రంధ్రము.
ఖః - సామాన్యమైనది, అభావము.
ఖ్యా - ప్రసిద్ధి చెప్పుట.
గ  - వినాయకుడు, గంధర్వుడు, గానము, సంతోషవాక్యము.
గః -  గంధర్వుడు, గణపతి, గుర్వక్షరము, ఒక స్వరము,
          గానము, గమయిత, గాయకుడు.
గా -  పూర్వకథ, శ్లోకం, స్తుతి.
గీః - వాక్కు, స్తుతి.
గు - మలవిసర్జనము.
గుః - విజ్ఞానము, చీకటి.
గూః - మలము
గృ - తడుపుట, ఎఁఱుగుట, విన్నపము.
గౄ - ధ్వనించుట, మించుట.
గో - యాగము, వృషభము, చంద్రుడు, వాక్కు, భూమి,
          దిక్కు, గోవు, కిరణము, బాణము, నేత్రము, స్వర్గము,
          వజ్రాయుధము, జలము, రోమము, సరస్వతి, గుఱి,
          సూర్యుడు.
గౌః - కిరణము, గోమేధికము, వజ్రము, వజ్రాయుధము,
            చంద్రుడు, సూర్యుడు, గోవు, ఇంద్రియము, కన్ను,
            తల్లి, బాణము, తొమ్మిది, జలము, వాక్కు, వెంట్రుక,
            భూమి.
గ్మా - భూమి
గ్లై - సంతోషహాని, బడలిక.
గ్లౌః - చంద్రుడు, కర్పూరము.
గ్లౌమ్ - భూబీజము.
  -  మేఘము, వేడిమి, చిఱుగంట, ఘంట,
             సంఘటనము, శివుడు, గుడ్లగూబ, వాద్యము,
             అమృతము, నేల, గొల్లపల్లె, అమ్ము, భయంకరము,
             ఒరుయుట.

ఘం -  వాద్యము, అమృతము, భూమి, లోక వృత్తాంతము,
                భయంకరము, స్తంభనకర సౌభాగ్య బీజాక్షరము.

ఘః -   మేఘము, చిఱుగంటలు, సంహారము,
               వేడిమి, ఘర్ఘర ధ్వని, లఘువు.

ఘా -  దెబ్బ, స్త్రీల కంఠ్యాభరణము


ఘుః  -  పందిముట్టె

ఘూః - ధ్వని

ఘుమ్ - అవ్యక్తధ్వని బీజము

ఘ్నీమ్ - శంఘ్ని శాలికాశ్యాలా శాద్వలా
                       శుష్కలా అను బీజపంచకము.

 -  భైరవుడు, కాటుక, విషయము,
         విషయేచ్ఛ, వేణునాదము

ఙమ్ -  కాటుక, భయంకరము, దేశము, జనము,
                 శివుడు, మాట, విషయవాంఛ


 - తురుష్కుడు, చోరుడు, ధ్వని, చంద్రుడు, చకోరపక్షి,
          చామరము, సముచ్ఛయార్థము, అతిశయము, ఆజ్ఞ, దీప్తి,
          శివుడు, సూర్యుడు.

చమ్ -  అభిచారమును పోగొట్టు ఒక క్రూరబీజము.

 -   కోరిక, కప్పుట, సంవత్సరము, వెలుగు,
           స్వచ్ఛమైనది, నిత్యమైనది, మలినమైనది,
          వేరైనది, కంచె, బరిణె, నిర్మలము.

ఛః - నాయకమణి, కోయవాడు.

ఛమ్ - భూతములను పారద్రోలెడు,
                 భీకర రక్తదంష్ట్ర బీజవిశేషము.

ఛాః - భేదయిత, పాదరసము.

జః -   విష్ణవు, విప్రుడు, జగణము, జన్మ, ముక్తి, తండ్రి,
             పిశాచము, తేజస్సు, విషము, జాతుడు, జేత,
            వేగము కలవాడు.

 - జపము, జయశీలుడౌ పురుషుడు, ధ్వని, మేరువు, మత్సరము,
         శివుడు, విష్ణవు, గాయకుడు, నీరు, గంగ, నగ, భార్య,
          దేవసేన, యోని, సముద్రపుటొడ్డు.

జం - కటి ప్రదేశము, భూషణము,
             భార్య, తేజము, ఉదకము,  జననము.

జమ్ - పనులను జెరచునది, తిరస్కరింపరానిదగు ఒక బీజాక్షరం.

జుః    - కీర్తి, యుద్ధము, జీర్ణించుట, బృహస్పతి, ఆకాశము, పిశాచము.

జూః  - సరస్వతి, ఆకాశము, స్త్రీ భూతము, వేగము.

జ్యా - వింటినారి, తల్లి, భూమి.

 -    బ్రహ్మ, అందె, పరాక్రమము, భ్రమణము, నాశము,
                చోరుడు, ఝంఝామారుతము, మదము, ధ్వని,
                 గాలివాన, నశించునది, అలంకారము.

ఝమ్ - భూతనాశకబీజము, నర్తకబీజము, ఇచ్ఛాబీజము.

 -   సమూహము, దేశము, గర్వము, గంధలేపనము, శిరస్సు,
             గాడిదె కూత, ఊర్ధ్వముఖమైనది, మూఢరూపమైనది,
             భయము, కీర్తి, గాయకుడు, జనపదము, పద్యము,
            వాయుభేదము, ఝర్ఝరమను ధ్వని.

జ్ఞ - విద్వాంసుడు, బ్రహ్మ, బుధుడు.
 - భూమి వడగండ్లు, ధ్వని, తలుపు, విల్లు, పొగ, కాకి,
          సూర్యకిరణం, నీటిసుడి, పుత్రుడు, ఉత్పత్తి, ఆవృత్తి,
          చమరీమృగము, పలుమార్లు పలకడం.

టః -కొట్టునట్టివాడు, పాదము, ధ్వని

టం - టంకారము, సర్వవ్యాధి హరబీజము,
               షణ్ముఖ బీజము, స్వనబీజము.

టా - భూమి.

 -   పిల్లన గ్రోవి, ధ్వని, కట్టుట, దృఢము, అగ్ని

ఠః -   శివుడు, ఠమ్మను చప్పుడు, చంద్రమండలము, విషయము,   
            బిందువు, సాహసము, జనులగుంపు, మూర్ఖుడు, శూన్యము.

ఠమ్ - చంద్రబీజము, ధ్వనిబీజము, పద్మబీజము.

 - దేశము, శంభుడు, చిఱునగవు, భయము, నాశము,
         జయధ్వని, శంఖధ్వని, రౌద్రరసము, సిగ్గు, వాక్కు,
         డామరవాద్యము, దుర్గమ స్థలము, వస్త్రము,
         డమరుకవాద్యము, ఆందోళనము, గాయకుడు, జడుడు.

డమ్ - విషహరమగు ఒక బీజము, గరుడ బీజము,
                 రేణుకా బీజము, అంజనీబీజము, అందలము,
                 గాయకుడు.

డా - డాకిని.

 - పిశాచము, భయము, కాలము, ప్రేమ, మార్గస్థుడు,
         ధ్వని, జయభేరి, పోలిక, జ్ఞానము, వాద్యము, గుణహీనుడు,
          దాగినవాడు, సాధువు, ఎడమ కుడి పిక్కలు, కొడుకు.

ఢః - ఢక్క, కుక్క, కుక్కతోక, ధ్వని, నిర్గుణము.

ఢమ్ - సకల సంపత్ప్రదమగు ఒక బీజము,
                 వాయుబీజము,  బాణ బీజము.


ణ - జారుడు, భయంకరుడు, కంటకము,
          ధ్వని, గగుర్పాటు, శూరుడు, కాపాడుట, ముల్లు.

ణః -  వరహము, నగ, సత్యము, చలిపందిరి, బిందుదేవుడు,
             గుణరహితుడు, నిర్ణయము, 

ణా -  గోవు,రాత్రి, పాన్పు, ముక్కు,
             దయ, తామరరేకు, జ్ఞానము
 -  సంభోగము, నిశ్చయము, కోపము, తోక, రసవాదము,
          చోరుడు, దయ, ఆడుట, కారణము.

తః -  మణి, నవ్వు, చూలు, ఓర్పు, అమృతము, బుద్ధుడు,
            యువకుడు, మోసము, మ్లేచ్ఛుడు, దొంగ, పందితోక

తత్ -   ప్రస్తుతార్థము, హేతువు,
                  వేతనములేక పనిచేయువాడు.


తమ్ -  ఆలయము, బాధనొందు,
                  ధనధాన్యములనొసగు బీజాక్షరము,
                  తమోబీజము.

తప్ -    ప్రకాశించు, వెచ్చగానుండు, బాధసహించు,
                 శరీరమును కృశింపచేయు, తగులబడు.

తా -   పుణ్యము


తృష్ -   దప్పిక, తీవ్రమగు కోరిక.


తే -   పార్వతి

తేః -   క్రీడించు, క్రీడించువాడు, నది, భయమును పోగొట్టుట,
             నలుపు, తెలుపు, లావు


త్యజ్ -  విడిచిపెట్టు, వదిలించుకొను


త్వచ్ -  తోలు, వల్కలము, ఆవరణము, స్పర్శేంద్రియము.

త్వమ్ -  నీవు

త్వట్ -   కాంతి, అగ్నిజ్వాల, వెలుగు.

త్రుట్ -  తెగుట, చిరుగుట.

త్రై -   కాపాడు, రక్షించు.

థః -   కొండ, నీతినికాపాడుట.
 - దాత, భేదించుట, ఓర్పు, దానము, పానము, వైరాగ్యము,
         భార్య, చూపు, మూగ, పట్టుబడినది, పరిశుద్ధుడు, దావకము, 
         శుచి, శివుడు, గురుడు, త్రాగుట, పిలుపు.


దః - దయ, దానము, దమము, దాత ,దత్తము, ఖండనము,
            భార్య, ఆకాశము,ఖండనము, ఇచ్చుట.


దమ్  - భార్య, పుష్టి, వృద్ధులు, కలిగించు, సుందర బీజాక్షరము,
                 శాంతించుట, అడ్డగించుట, వశపరచుకొనుట.

దల్ - ముక్కలగుట, వికసించుట.


దా -  ఖండనము, రక్షణము, శోధనము,
            దళము, దానము, రోగము.

దామ్ - దత్తాత్రేయ బీజము.

దుర్ - అమంగళము, దుఃఖము.

దృక్ - దర్శనము, జ్ఞానము, నేత్రము, చూచువాడు.


దృశ్ - చూచు, వెదకు, నిశ్చయించు.


ద్యు   - దినము. ఆకాశము, ప్రకాశము,
                   స్వరము, అగ్ని.

ద్యుత్ - ప్రకాశించు, వెలుగు.
 -  ఇంద్రుడు, ధ్వని, ధాన్యము, కుబేరుడు,
         ధన్వంతరి, కడవ, గృహము, ధనము.

ధం - ధనము, ధనికుడు.

ధః - బ్రహ్మదేవుడు, మనువు

ధా / ధిః, / ధీః - బుద్ధి

ధిక్ - ధక్కారము, నింద.

ధూః - బరువు, ధనము, వణకుట,
                కదలుట, కలతజెందుట.

ధ్మా -  ఊదుట, నిస్వనించుట, నిప్పుమండునట్లుచేయుట.

 -  వినాయకుడు, నాభి, జ్ఞానము, వాద్యము, గొడ్రాలు, 
          సూక్ష్మమైనది, మిగుల కష్టమైనది, శూన్యమైనది, భేదమైనది,
          దానము, మేలు, అభావార్థము.

నః -  అధిపతి, పడవ, బౌద్ధశాస్త్రవేత్త, బుద్ధుడు, స్తోత్రము,
           వృక్షము, స్వాగతము, చుట్టము, చెట్టు, సూర్యుడు,
           బంగారము, బంధము, రత్నము.

నా  -   మోడు, వరుడు, మగవాడు, నాయకుడు, నిషేధము.

ని -  బెదిరించు, మత్సరము, వంగుట, మిక్కలి, స్వరము.

నిర్ - నిషేధము, నిశ్చయము.

నీ -  తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట.

ను - నుతి

నుద్ -  ప్రేరణ, ప్రోత్సహించుట, తొలగించుట.


నౌః -  ఓడ, కాలము, నవ్వు
 - వాయువు, పర్వతము, ప్రకాశము, కౌస్తుభము,
         క్షణము, శుభలగ్నము.

పమ్ -  బంగారము, పానముచేయువాడు, నీటిధార,
             సమ్మతి, ఆపన్నుడు, కోపశూన్యుడు.

పః - పరమాత్మ, పానము, పవనము, పతనము, పవిత్రము,
           పాపనాశకరము, పంచమస్వరస్థానము, కుబేరుడు,
           పడమటి దిక్కు, పాలించివాడు.

పాః -  పాలనకర్త, పవిత్రము, పూరితము, బూరుగుచెట్టు,
             తీగసంకెల, నిర్మలమైనది.

పా - రక్షించుట, త్రాగుట, పీల్చుట.

పుం - పురుషుడు,  పరమాత్మ.

పూ - పూవు, శిద్ధి, పవిత్రము.

పూర్ - పురము, శరీరము, పూరించుట.

పణ్ - వ్యవహారము చేయుట, స్తోత్రము చేయుట.

పత్ - పడుట, దిగుట, క్రిందికి వచ్చు, ఎగురుట.

పద్ - పాదము, అడుగు, నాల్గవభాగము.

ప్ర - ప్రాధాన్యము, అతిశయించుట.

ప్లు - ఈదుట, తేలుట, నావచే దాటుట, ఎగురుట, జారుట.

 - గాలితోకూడిన వాన, భుజమును తట్టుట, ఫూత్కారము,
        నివారించుట, యుద్ధము. పిలుచుట

ఫః - అభివృద్ధి, కఠినోక్తి, నిరర్థక సంభాషణ, 
           వాతము, కఫము, విస్తారమైన, మరుగైన.

ఫాః - వృద్ధి, వర్ధకము, సంతాపము, వ్యర్థవాక్యము.
             16వ భాగము,  ఆట, గుడిసె.
 - కుంభము, వరుణుడు, బిందువు, వికల్పము, గురువు,
         మదము, సంపదలను కలుగజేయువాడు,  కలహము,
         పక్షము, గర్భము, పర్వతము.

బః -  సంద్రము, జలము, వరుణడు, కడవయోని,
            గొఱుగుట, గదాయుధము, పండు.

బమ్ - సకల దోషములను హరించు నొక ఊర్మి బీజాక్షరము.

బర్హ్ - పలుకు, ఇచ్చు, గాయపరచు, చంపు,
              నాశనముచేయు, వ్యాపించు.

బా - బూరుగ, తీగె, సంకిళ్లు, స్వచ్ఛమైన.

బాధ్ - పీడించు, హింసించు, తొలగించు, గాయపరచు.

బృహ్ - పెరుగు వృద్ధినొందు, గర్జించు.

 - శివుడు, తుమ్మెద, స్వభావము, శుక్రుడు, కిరణము,
         మేఘము, భూమి, అలంకారము, ప్రకాశము.

భః - గ్రహము, భ్రాంతి, భగణము, భవనము, గృహము,
            భార్గవుడు, భూధరము, భృంగము.

భక్ష్ - తినుట, మ్రింగుట, జీర్ణించుకొనుట, ఉపయోగించుట.

భజ్ -  పంచుట, నిర్దేశించుట, అనుభవించుట,
                అభ్యసించుట,  సేవించుట, గౌరవించుట.

భంజ్ - ముక్కలుగ చేయుట, చెడగొట్టుట, ఓడించుట.

భష్ - మొరుగుట.

భమ్ -   నక్షత్రము, (మేషాది)రాశి,  సమస్త భూతోచ్ఛాటన
                చేయునట్టి భీకర బీజాక్షరము.
భాః -  సాధనము, కాంతి, ఆకాశము, రాశి, నక్షత్రము,
             త్రిపుండ్రము, ఊర్థ్వ పుండ్రము, చక్రము.

భాష్ - మాట్లాడుట.

భాస్ - ప్రకాశించుట.

భిః  - గోడ, పక్షి, భయము.

భిక్ష్ - యాచించుట.

భీః - భయము

భుః - శివుడు, బ్రహ్మ, చంద్రుడు.

భూ -  అగుట, పుట్టుట, వెలువడుట, ఉండుట,
              జీవించి ఉండుట, నిలుచుట.

భూః - భూమి, ఉనికి, చోటు, ఒకటి.

భూష్ - అలంకరిచుట

భృ - భరించుట, మోయుట.

భోః - ఆహ్వానము, సంబోధనము.

భ్రమ్ - ఇటు నటు తిరుగుట.

భ్రాజ్ - ప్రకాశించుట.
మః - మగణము, బంధనము, పచ్చవన్నె, గోరోజనము
             వంటి వర్ణము, బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు,
            వేళ, విషము, మంత్రము, చంద్రుడు.

మండ్ - అలంకరించు

మద్ - మత్తిల్లుట, పిచ్చివాడగుట,
                 సంతోషించుట, ఆపదనొందుట.

మన్ - గర్వించిట, పూజించుట, విశ్వసించుట, కల్పించుట,
                ఆదరించుట, తెలిసికొనుట, స్వీకరించుట, కోరుట,   
               మనస్సు లగ్నంచేయుట.

మన్ద్ - ప్రసన్నుడగుట, శిధిలమగు, ప్రకాశించుట,
                  మెల్లమెల్లగా పోవుట, తిరుగుట.

మహ్ - ఆదరించుట, సమ్మానముచేయుట,
                  వికసించుట, వృద్ధినొందుట.

మమ్ - శత్రువులను ముగ్ధులను చేసే ఒక బీజాక్షరము,
                   భేకీబీజము, శిలీబీజము

మా - ప్రమాణము, మరణము, సముద్రపుటొడ్డు, ధారణగల బుద్ధి,
             లక్ష్మీదేవి, మధ్యప్రదేశము, తల్లి, నిషేధము, జనము

మార్గ్ - ప్రార్థించుట, వెదకుట, అలరించుట, పోవుట.

మార్జ్ - పరిశుద్ధము చేయుట.

మాస్ - చంద్రుడు, మాసము.

మిథ్ - సహకారి అగుట, ఒక్కచో కలియుట,
                మైధున మొనర్చుట,  గాయముకలిగించుట,
                 దెబ్బతీయుట.

మిల్ - కలియుట, చేరుట.

మిశ్ర్ - కలుపుట.

మిష్ - కన్నుతెఱచుట, చూచుట.

మిహ్ - తడుపుట, మూత్రవిసర్జనము,
                   వీర్య పాతము చేయుట.

మీ - పోవుట, నశించుట, తెలిసికొనుట, చచ్చుట,
            (చంపుట, నాశనముచేయుట) తగ్గించుట,
            మార్చుట, మీరుట.

మీల్ - (కండ్లు)మూయుట, ముడుచుకొనుట,
                  కలియుట, మూసుకొనుట.
ముచ్ - మోసముచేయుట, వదులు చేయుట, విడిచిపెట్టుట,
                    స్వతంత్రము చేయుట(ఇచ్చుట).

ముండ్ - (తల)గొరుగుట, మునుగుట.

ముద్ - ఆనందము, సంతోషము, ప్రసన్నుడగుట.

ముర్చ్ - గాఢమగుట, కూడుట, మూర్ఛిల్లుట, పెరుగుట,
                      లావగుట, ప్రభావము చూపుట, నిండుట, వ్యాపించుట.

ముష్ - దొంగిలించుట, తీసికొనుట.


ముహ్ - పరవశించుట, మూర్ఛిల్లుట, మూఢుడగుట.

మృ - మరణించుట, నశించుట.

మృగ్ - వెదకుట, ప్రత్నించుట, అనుసరించుట.

మృజ్ - శబ్దము చేయుట, శుద్ధిచేయుట, అలంకరించుట.

మృద్ - త్రొక్కుట, అడచుట, చంపుట,
                      హింసించుట, జయించుట.
                     మట్టి, ఎర్రమన్ను.

మృశ్ - తాకుట, పట్టుకొనుట, ఆలోచించుట.

మృష్ - వెదజల్లుట, సహించుట,
                      అనుభవించుట, క్షమించుట.

మే - మార్చుకొనుట.

మేధ్ - కలియుట, ఒండొరులు కలిసికొనుట. తెలిసికొనుట,
                  దెబ్బతీయుట, చంపుట.

మోక్ష్ - విడచుట, స్వతంత్రునిచేయుట.

మ్నా - మరలమరల చెప్పుట, వల్లించుట,
                  స్మరించుట, తలంచుట, ఆలోచించుట.

మ్లై - వాడిపోవుట, అలసటనొందుట, నిరుత్సాహమునొందుట.
యః  - కీర్తి, ప్రయాణము, వాయువు, త్యాగము, పోవువాడు,
               స్థానము, యోగము, యముడు, దాత, మగణము.

యమ్ -  సర్వవ్యాపకమగు ఒక పవిత్రబీజాక్షరము, వాయుబీజము,
                     వశ్యబీజము, వీరబీజము, యత్నము, యమున.

యజ్ - యాగముచేయుట, ఆహుతులిచ్చుట, పూజించుట.

యత్ - సర్వనామము, అవ్యయము, హేతువు, ప్రయత్నించుట.

యద్ - ఎవడు, ఎవతె, ఏది.

యన్త్ర్ - నిలువుట, అడ్డుకొను.

యా -  కీర్తి, యానము, వాహనము, పూలగుత్తి, కాంతి, లక్ష్మి,   
                నిర్మాణము, ప్రాప్తి, త్యాగము, పోవుట.

యాచ్ - కోరుట, అడుగుట.

యు - కలియుట, వేరువేరుగా చేయుట.

యుజ్ - కలియుట, అనురక్తుడగుట, చేరుట, ప్రయోగించుట,
                      నియోగించుట, కలుపుట, కలిసినవాడు.

యుధ్ - పోరు(సంగ్రామము), యుద్ధము చేయుట,
                      సంఘర్ష మొనర్చు.
 - అగ్ని, మన్మథుడు, నాశనము,
         వజ్రము, హస్తము, ఋతువు.

రం - నెత్తురు, శిరస్సు, ధ్యానము, ఆకాశము,
             గ్రుడ్డు,కడుపు, ముఖము, భయము,
             విరసము, త్యాగము, రసహీనమైనది, తీక్షణము.

రః - రాముడు, వాయువు, అగ్ని, భూమి,
           ధనము, ఇంద్రియము, ధనాటంకము.

రంహ్ - కలిసిపోవుట, వేగముగా పోవుట.

రక్ష్ - కాపాడుట, రాజ్యము చేయుట, పొదుపుచేయుట.


రచ్ - రచించుట, సిద్ధము చేయుట,
              వ్రాయుట, అలంకరించుట.

రంజ్ - సంతోష పెట్టుట, ఎఱ్ఱనగుట,
                   అనురక్తుడగుట, ప్రసన్నుడగుట.

రట్   - అఱచుట, ఆక్రందించుట.

రణ్ - ధ్వనిచేయుట.

రద్ - ముక్కలు చేయుట, చీల్చుట.

రధ్ - గాయపరచుట, బాధకలిగించుట.

రభ్ - ఆరంభించుట, తొందరపడుట.

రమ్ - ప్రసన్నుడగుట, సంతుష్టుడగుట, ఆడుట,
                సంభోగము చేయుట, ఉండుట.

రయ్ - పోవుట.

రస్ - ధ్వనించుట, కూయుట,
              శబ్దము చేయుట, రుచిచూచుట.

రహ్ - విడచుట, త్యాగము చేయుట.

రా - బంగారము, మబ్బు, ధ్వని, శాల, చెప్పుట,
           నడచుట, ఇచ్చుట, గ్రహించుట, సమర్పించుట.

రాః - ముద్రాంకితమైన ధనము, పసిడి.

రాజ్ - రాజు, ప్రకాశించుట, మెఱయుట,
                సుందరముగా అగుపడుట.
రి - స్రావము, నాళము, అగ్నిబీజము.

రిః - స్రవించుట, క్షమించుట.

రిచ్ -  శూన్యము చేయుట, శుభ్రము చేయుట,
                పోగొట్టుట, విడగొట్టుట.

రుః - భయము.

రుచ్ - ప్రకాశించుట, ఇష్టమగుట.


రుజ్ - ముక్కలు చేయుట, నాశము చేయుట, బాధకలిగించుట,
                 పీడించుట, రోగగ్రస్తుని చేయుట,వంగుట, విరుగుట,
      

రుఢ్ - రాగము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి.
                యుద్ధము, భయము, ధ్వని.

రుద్ - ఏడ్చు, దుఃఖము, కన్నీరు కార్చు.

రుధ్ - అడ్డగించు, నిలుపు, ఎదిరించు, నిరోధించు,
                 నిలువచేయు, మూయు, కట్టివేయు.

రుశ్ - గాయపరచు, చంపు, నాశముచేయు.


రుష్ - కోపించుట, కలతనొందుట, గాయపరచుట, చంపుట,
                 బాధించుట, రోషము, కోపము.

రుహ్ - మొలకెత్తుట, పెరుగుట, ఎక్కుట.


రూ - యువతి, చెదలు, బంగారము, కామరూపి.
రుక్ - రోషము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి,
               యుద్ధము, భయము,ధ్వని.

రూష్ - అలంకరించు, పూయు.

రై - ధనము, శబ్దముచేయుట.

 - ఖండింపబడునది, గ్రహించుట,
          చంద్రుడు, లవణము.

లమ్ - విశ్వమును భరించునట్టి ఒక ప్రకాశబీజాక్షరము.

లః - కాంతి, ఆకాశము, భూమి, భయము, సంతోషము,
             గాలి, లవణము, దానము, ఆలింగనము, తలపు,
            ప్రళయము, సాధనము, మనస్సు, వరుణుడు, లీనము,    
            లఘువు, ఓదార్చుట.

లక్ష్ - చూచుట, గురిపెట్టుట, స్పష్టముచేయుట.


లగ్ - తగులుకొనుట, అంటుకొనుట, కలియుట.

లంఘ్ -  దూకుట, ఎక్కుట, ఎగురుట, దాటుట,
                       అనాదరించుట. నిలుపుట, ఆక్రమించుట,
                      ముందునకు చొచ్చుట, ఉపవాసముచేయుట.

లజ్ - సిగ్గుపడుట, కళంకితమొనర్చుట,
                అగపడుట, ప్రకాశించుట, మూయుట.

లజ్జ్ - సిగ్గుపడుట.


లప్ - మాటలాడుట.

లంబ్ - వ్రేలాడుట, అంటుకొనుట, ఆశ్రయించుట,
                     విలంబముచేయుట, ధ్వనిచేయుట.

లభ్ - పొందు, సంపాదించు, పట్టుకొను,
                తెలిసికొను, నేర్చుకొను.

లల్ - క్రీడించుట, ప్రేమతో చూచుట.
లష్ - కోరుట, ఇచ్చగించుట.

లస్ - ప్రకాశించుట, వెలుగొందుట, స్పటపడుట.

లస్జ్ - సిగ్గుపడుట.

లా - తీసుకొనుట, పొందుట.

లిఖ్ - వ్రాయుట, లిపిబద్ధముచేయుట, గీయుట, గీరుట.

లింప్ - పూయుట, మలినమొనర్చుట.

లిహ్ - నాకుట, నమలుట.

లీ - కఱగు, ద్రవించు, అనుసరించు, అంటుకొను,
          పట్టుకొనియుండు, కౌగిలించుకొను, కఱగిపోవు,
          అదృశ్యమగు.

లుంచ్ - కోయు, లాగు, చించు

లుఠ్ - పడగొట్టుట, నేలపై దొరలుట, బాధన నుభవించుట,
                 కదలుట, దొంగిలించు, దొరలుట.

లుడ్ - కల్లోలము చేయుట, కలియగలుపుట.

లుంట్ - పోవు, దొంగిలించు, కుంటివాడగు, సోమరియగు,
                       దోపిడీ చేయు, అనాదరము చేయు.

లుంఠ్ - పోవు, ఆందోళనచేయు, కుంటియగు,
                      నిష్క్రియుడగు, దోపిడీచేయు, అడగించు.

లుప్ - ఆశ్చర్యపడు, ఆశ్చర్యపరచు, కలవరపడప,
                  కలవరపెట్టు, త్రుంచుట, విఱచుట, కోయుట,
                 పాడుచేయుట, అపహరించుట, గుంజుకొనిపోవుట,
                 పట్టివేయుట, కప్పిపుచ్చుట.

లుభ్ - ఆసపడు, ఆతురతతో కోరు.

లుల్ - తిరుగు దొరలు, ఇటునటు ఊగిసలాడు,
                   కదలు, కలతనొందు, అణచు.
లేప్ - పోవు, కదలు, ప్రార్థించు

లోక్ - చూచు, వీక్షించు, ప్రదర్శించు,
      తెలిసికొను, ప్రకాశించు, మాటలాడు.

లోచ్ - చూచు, ప్రదర్శించు, చూచి ఆలోచించు,
       పలుకు, ప్రకాశించు.

లోడ్- మూర్ఖుడగు

ల్యం - లయము, నిలయము.

ల్హౌం - హయగ్తీవబీజము

 - సాత్వికుడు, వాయువు, వరుణుడు, మన్మథుడు.

వమ్ - అమృత(జల-తరంగ - అభ్ర - ధరణీ - వరుణ)బీజము.

వః - వాయువు, సముద్రము, నమస్కారము, వసతి, వరుణుడు,
      వరుణబీజము, భూబీజము, తమోబీజము.


వచ్ - పలుకు, చెప్పుట, వర్ణించుట.

వంచ్ - చేరుట, పోవుట, తిరుగుట, మోసగించుట.

వద్ - పలుకుట, తెలుపు.

వధ్ - చంపుట

వంద్ - నమస్కరించుట, స్తోత్రముచేయుట.

వప్ - విత్తుట, గొఱుగుట.

వమ్ - క్రక్కుట

వయ్ - నేయుట
వర్  - కోరుట


వల్ - తిరుగుట, పోవుట

వశ్ - కోరుట

వస్ - నివసించు, ఉండు.

హ్ - మోయు, వీచు, ప్రవహించు, కొనిపోవు, ఓడ.

వా - వికల్పార్థము, ఉపమానార్థము, గాలి వీచుట.

వాచ్ - వాక్కు, సరస్వతి

వాంఛ్ - కోరుట

వార్ - నీరు

వి    - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ, పక్షి,
             (నిషేధము, వేఱు, విశేషము)

విద్   - తెలిసికొనుట,పొందుట, ఉండుట, ఆలోచించుట.
వి - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ,
        పక్షి, (నిషేధము, వేఱు, విశేషము)


విట్ - వైశ్యుడు, జనుడు, పురీషము.


విశ్ - ప్రవేశించు, మనుష్యుడు.


విష్ - తడుపుట, వ్యాపించుట.


వీ - పోవుట, కనుట.


వీజ్ - విసరుట, పోవుట.


వృ - వరించుట, పూజించుట, ఆవరించుట.


వృజ్ - విడచి పెట్టుట.


వృత్ - ఉండుట, వరించుట, ఇష్టపడుట.


వృధ్ - పెరుగుట.


వృష్ - కురియుట, వానపడుట, ఇచ్చుట.


వే - నేయుట, కుట్టుట.


వేప్ - వణకుట.


వేల్ల్ - కదలుట.


వ్యథ్ - భయపడు, దుఃఖించు, గుచ్చుట, కొట్టుట.


వ్రజ్ - పోవుట
శం - శివుడు, శాస్త్రము, శ్రేయస్సు, శుభము, కీర్తి,
            ఇంద్రధనుస్సు, స్వర్గము, ఎదుటలేనివాడు.

శః - సీమ(హద్దు), శయనము, హింస, పుట్ట, తాబేలు,
           రాజు, శిష్యుడు, న్యూనపరచు, శస్త్రము, శుభము.

శమ్ -  సర్వఫలప్రదము సుఖదాయకము అగు బీజాక్షరము.
                తగుట, అణగుట, సమృద్ధి.

శంస్ - ప్రశంసించుట, స్తోత్రము చేయుట, అంగీకరించుట.

శక్ - యోగ్యుడగుట, సమర్థుడగుట.

శంక్ - సందేహము

శప్ - శాపము పెట్టుట, నిందించుట.

శబ్ - శబ్దము

శా - దేవతాపూజ, శక్తి(సామర్థ్యము) శోభ, శ్రేష్ఠుడు, లక్ష్మి.

శాస్ - ఉదేశించు, పాలించు.

శి - శివుడు, శుభము, కాంతుడు, మోక్షము, హింస, నిద్ర.
శిక్ష్ - నేర్చుకొను.

శీ - నిద్రించు.

శుచ్ - నిరాశ, దుఃఖము.

శుధ్ - పరిశుద్ధముచేయుట.

శుభ్ -  ప్రకాశించు

శుష్ - ఎండిపోవుట.

శ్రీ - ఐశ్వర్యము, సంపద, వృద్ధి, అలంకారము,
     లక్ష్మి, సరస్వతి, పార్వతి, బుద్ధి, విషము,
     సాలెపురుగు, ఒక రాగము, మారేడు చెట్టు,
     మంగళప్రదము, లవంగము, చిల్లచెట్టు, కాంతి,
     గౌరవార్థము కొన్నిపదాలకుముందు వచ్చునది.

శ్రు - వినుట.

శ్లథ్ - సడలుట

శ్లాఘ్ - పొగడుట, మెచ్చుకొనుట.
శ్లిష్ - కాల్చుట, కౌగిలించుకొనుట, కలియుట.

శ్వన్ - కుక్క

శ్వస్ - రేపు, గాలిపీల్చు, జీవించు.
 - స్వర్గము, దేశము, లక్ష్మి, గర్భము, మోక్షము,
          అవసానము, ఓర్చుట, పరోక్షము, శ్రేష్ఠము.

షః - స్వర్గము, కేశములు, పరోక్షము, శ్రేష్ఠము, నేర్పరి,
             పండితుడు, తుది, నాశము, ముక్తి, కాన్పు, తెలిసినది,
            గంభీర దృష్టిశాలి, ఉపద్రవము, ఎదురుగా.

షమ్ - ధర్మార్థ కామసిద్ధిదమగు ఒక పరిశుద్ధ బీజాక్షరము, 
                 తడిద్భీజము, గర్భము, మోక్షము, తుద.

షట్ - ఆరు వస్తువులు

 - గౌరీపుత్రుడు, వాయువు, శరీరకాంతి, రథ మార్గము,
          జ్ఞానము, ధాన్యము, నివారణము.

సః - ఏడు స్వరాలలో మొదటిది, సర్పస్థానము,
            విఘ్నేశ్వరుడు, వాయువు, బుధుడు, ఈశ్వరుడు,
           పాము, పక్షి, విష్ణువు, వాడు, సగణము, కోపము,
           హంస బీజము, ప్రాకారము.

సమ్ - సుందరము, సమము, కలయిక, లెస్సగా,
                 మిక్కిలి, వృద్ధి, సముచ్ఛయము, సర్వకారణము,
                 సమస్త వర్ణాత్మకమగు ఒక బీజాైక్షరము, శక్త్యాత్మక    
                సుఖాత్మకబీజము, జ్ఞానము, ధ్యానము, భేధములేనిది.

సత్ - నక్షత్రము, బ్రహ్మ.

సన్ - కాలము, సత్యము, విద్వాంసుడు, శ్రేష్ఠుడు,
               సత్పురుషుడు, పూజ్యుడు.

సహ్ - సహించుట, ఓర్చుట

సృ - పోవుట

సృజ్ - వదులు చేయుట, సృష్టించుట
స్మ - నిషేధము, స్మరణము, పాదపూరణము

స్వ - ధనము, జ్ఞాతి, తన సంబంధము,
             సుఖము, కాంతి, చంద్రకాంతి,
             తాను, స్వర్గము, పరలోకము

స్వర్ - స్వర్గము, పరలోకము, ఆకాశము


స్రక్ - పూలదండ

స్రజ్ - పూలమాల

స్రుచ్ - హోమము చేయు మిల్లిగంటె,
                    ఒక యజ్నోపకరణము

స్రాక్ - శీఘ్రముగా

సా - లక్ష్మి, పార్వతి, ప్రసిద్ధము

సాత్ - బ్రహ్మ

సిమ్ - అల్పము, సరస్వతి

స్విత్ - ప్రశ్న, వితర్కము
సిధ్ - పోవుట

స్నిహ్ - ప్రేమించుట, స్నేహముచేయుట

సు - పూజ, శ్రేష్ఠము, మంచి

స్ను -  కొండ, నెత్తము

స్తు - పొగడుట

సూ - ప్రేరణ, ప్రసవము.

సూచ్ - చీల్చు, చూపు, సూచించు.

సూద్ - గాయచఱచుట, చంపుట

సే - సేవనము, సేవకుడు

సేవ్ - సేవించుట.

సో - పార్వతి

స్త్రీ - వనిత, బొమ్మ, చెముడు

స్థ - స్తలము

స్పంద్ - కదలుట, అదరుట

స్పర్ధ్ - పోటీపడు

స్పృశ్ - తాకుట, గ్రహించుట
షమ్/ షం - సస్యం, మధువు, ధారణ

సత్ - సత్యం, యజ్ఞం, సాధుభావం,
               విష్ణు ప్రీతికరమైన  కర్మ,
               సద్భావం, మంచి

 - శివుడు, విష్ణువు, హంస, యుద్ధము, గగుర్పాటు,
           గుఱ్ఱము, గర్వము, వరుణుడు, పిలుపు(సంబోధనము),
           ప్రసిద్ధి, పాదపూరణము, పూజ, వికారము, నింద,
           చంపుట, ఆజ్ఞ, ప్రేరేపించుట, కోపము, ఏనుగు,
           దివసము, వైద్యుడు, పృథ్వీ బీజము, ప్రాణవాయువు.

హమ్ - అస్త్రము, సుఖము, పరబ్రహ్మ, బాణము, మణికాంతి,
                  పిలుచుట, లేచుట, నవ్వుట, వీణాది సకల వాద్యధ్వని,
                  ఆకాశబీజము.

హస్ - నవ్వుట

హా - మనోవ్యథ, వగపు, నింద, బాధ,
          పేడ, త్యాగము, నడుపు(గమనము), వీణ.


హి - ఆశ్చర్యము, వ్యధపడుట, పాదపూరణము, కారణము,
           సంతోషము, విచారము, పద్యావరణము, నిశ్చయము,
           అతిశయము, కారణవ్యాజము, తొట్రుపాటు, ఓర్వలేమి,
          సర్పము, మృగము


హిం - ప్రశ్న, ఊహ


హీ - ఆశ్చర్యము, పిలుచుట, దుఖఃము,
           వ్యాపారము,  వినయము.

హ్లీం - మృద్భీజము


హు - సంతోషము, కోపము, విచారము, నహుషుడు
హుమ్ - ఉహా, భయము, ప్రశ్న, కోపము,
                     ఆమంత్రణము, వరాహ బీజము
 
హూః - విప్రుడు

హూమ్ - ప్రశ్న, సమ్మతి, కోపము,
                      భయము,  నింద,

హృత్ - గుండెకాయ, మనస్సు

హే - ఓయి, కోపము, విచారము,
            పిలుచుట, ద్వేషము మొ.

హై - ఓయి, సంబోధించుట, ఆహ్వానించుట.

హో - ఓయి, పిలుచుట

హౌ - ఓయి, పిలుచుట.

హ్యః - నిన్న

హ్రాం - సూర్యబీజము

హ్రీః - పార్వతి, శక్తి, సిగ్గు, 

హ్రీం - మాయా(శక్తి)బీజము, బగళాబీజము, దేవీప్రణవం

హ్సౌం - ప్రాసాదబీజము
 - లేమి, కొంచెము

అత్ - నిరంతర గమనము

అర్హ్ - పూజించుట

అయ్ - వెళ్ళుట

ఆః - లక్ష్మి, బ్రహ్మ, వాక్కు, హద్దు, పీడ,

ఉత్ - ప్రకాశము, విభాగము, బలాధిక్యము, స్వస్థతలేకుండుట,
                సామర్థ్యము, ప్రధానము, కట్టుట, అభిప్రాయము,
               మోక్షము, లాభము, మొదట చేయదగిన విధి

ఏధ్ - వృద్ధినొందుట

కృప్ - సమర్థుడగుట

కమ్ - కోరుట

కృష్ - దున్నుట

తు - పాదపూరణము, విశేషము,
            ఏకక్రియాన్వయము, నిశ్చయము

దాన్ - ఇచ్చుట
ద్మా - ధ్వనించుట, అగ్నితో కలియుట

ధృ - ధరించుట, పట్టుకొనుట

ధ్యై - ధ్యానించుట

న - నిషేధించుట, సామ్యము

ని - గృహము, మిక్కిలి, క్రిందగుట, ఉంచుట, రాశి,
         ఆధారము, కట్టుట, మోక్షము, దానము, చూచుట,
         అణగుట, సమీపము, నేర్పు, చాలించుట, శాశ్వతము,
         సందేహము, నింద

ను - ప్రశ్న, సంశయార్థము, గడచినది, ఊఱట, ఊహ,
            అవమానము, మిష, అవాంతరార్థకల్పన, అతిక్రమించు,
            అడుగుట

నఞ్ - లేదు అడ్డగింత, స్వరూపము, అతిక్రమము,
                   కొంచెము, సామ్యము, విరోధము, ఇతరము

నభ్ - చంపుట

నమ్ - వంకరతిరుగుట, వంగుట, శబ్దము చేయుట

నయ్ - తీసుకొని వచ్చుట
అక్ - పోవు, ప్రాకు

అంశ్ - పంచి ఇచ్చుట

అగ్ - వీచు, పోవు

అంక్ - వంకరగా పోవుట, ముద్రవేయు, గుర్తు పెట్టు, 
                   మలినముచేయు, పోవు

అప్ - ఉదకము(నీరు)

అచ్ - పోవు, కదలు, గౌరవించు, ప్రార్థించు

అంచ్ - పూజించు, వంగు , గౌరవించు, ప్రార్థించు, గొణుగు

అంజ్ - ప్రకాశించు, అభిషేకము చేయు, అలరించు, ప్రేరణ

అట్ - తిరుగు. సంచరించు

అణ్ - శ్వాసించు, జీవించు, ధ్వనించు

అత్ - నడచు, తిరుగుట, కట్టివేయు

అద్ - తిను, చంపు

అన్ - గాలిపీల్చు, కదలు, జీవించు, కాపాడుట,
                సంతోషపరచుట, తృప్తినొందుట,
               అనుగ్రహముచూపుట, దయచూపుట
అయ్ - పోవుట, లోనికి వచ్చుట

అర్థ్ - యాచించుట, కోరుట

అశ్ - వ్యాప్తమగుట, పూర్తిగా నిండుట, ప్రవేశించుట,
              చేరుట, పొందుట, అనుభవించుట, తినుట,
             రుచిచూచుట

అస్ - అగుట, ఉండుట, విసరుట, విడచుట, పోవుట,
                తీసికొనుట, ప్రకాశించుట, పట్టుకొనుట
అర్ఘ్ - వెలకట్టుట

అర్చ్ - పూజించుట, గౌరవించుట

అర్ - సంపాదించుట, బాధించుట, పీడించుట,
               యాచించుట, పోవుట.

ఆప్ - పొందుట, చేరుట, పోవుట, వ్యాపించుట,
               కలిగించుట, ఆక్రమించుట.

ఆస్ - కూర్చుండుట, పరుండుట, విశ్రాంతిగైకొనుట,
                నివసించుట, ఊరకుండుట, మరియు
               ఈ సందర్భాలలో అస్ అని వాడతారు-
               స్మరణము, క్రోధము, బాధ, దుఃఖము,త్రోసిపుచ్చుట.
  
 - వెళ్ళుట, అధ్యయనముచేయుట

ఈక్ష్ - దర్శించుట

ఊర్ణ్ - కప్పుట
ఈక్ష్ - చూచుట, ఆలోచించుట

ఈట్ - ఈశ్వరుడు

ఈడ్ - స్తోత్రము చేయుట

ఈర్ష్య్ - సహించలేకలేక పోవిట, ఈర్ష్యపడుట

ఈశ్ - పాలించు, అధికారముచేయు,
               సమర్థుడగు, సంపాదించుకొను

ఈహ్ - తలంచు, కోరు, పొందు, లక్ష్యముచేయు

 - శివుడు, సంబోధనము, కోపము, తపము,
           ప్రశ్నము, విహరించుట, దయ, శబ్దపూరణ,
          పాదపూరణ.

ఉః - క్షత్రియుడు,

ఉక్ష్ - తడపు, చల్లు, పంపు

ఉచ్ - ప్రోవుచేయు, ఇష్టపడు, తగియుండు, అలవాటుపడు

ఉజ్ఝ్ - విడిచిపెట్టు, తప్పించుకొను

ఉంఛ్ - ఏరు, ప్రోగుచేయు
ఉద్ - ఈ క్రింది అర్థములలో ఉపయోగింప బడుతున్నది
                ఉన్నతస్థానము, వినియోగము, బయట, నుండి,
               పైకి పోవుట, సంపాదించుట, ప్రచారము, ఆశ్చర్యము,
                ఉత్కంఠ మొదలైనవి.

  - వాక్యారంభము, రక్షించుట, గురుస్వరూపము, ఇచ్ఛ, స్వామ్యం

ఊం - కోపంతో పలుకుట, అడుగుట, నింద, పోటి

ఊః - పురుషుడు, చంద్రుడు, రాజపుత్రుడు, కంఠము, దేవత,
               గొప్పముంగిలి, సాటి, నిండుకడవ(పూర్ణకుంభం),
              వర్తకుడు, రక్షించుట,  రక్షకుడు, మహేశ్వరుడు,
              పోలిక, , ఇంద్రుడు

 - వాక్యము, నిందించుట

ఋధ్ - వృద్ధినొందుట, వర్ధల్లుట, తృప్తినొందుట

 - వాక్యము, కాపాడుట, నింద, భయము

ౠః - తలవెండ్రుక, పాము, చూపు, దరిద్రుడు, స్వర్ణము,
                 కమలము, స్వర్గము, డబ్బు, నేరేడుచెట్టు, భైరవుడు,
                 దానవుడు

మ్ - సమ్మోహనకరమూ ఉజ్వలమూ అయిన ఒక బీజాక్షరం


ఌః - శివుడు, ఏనుగుదంతము, ఎండ్రకాయ, కోతి, కోర,
             స్వర్గము, అదితిదేవి, గంధము మొదలైన వాటిచే
            పూయబడిన శరీరము, చనిపోయిన మనుమడుగలవాడు,
            ఱొమ్ము, కాపాడుట.

 - ఊసరవెల్లి, పర్వతము, శరీరము, శుభమును చేయువాడు,
              దేవత, విలాసగమనము, కన్ను, ఎముక, కద్రువతల్లి, స్త్రీ.

 - తేజస్సు, ఉదకము, రాత్రి, మేడయొక్క మధ్యభాగము, విష్ణువు.

ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట

ఏధ్ - వృద్ధినొందుట, సుఖముగా జీవించుట
 - స్మృతి, ఆకలింతకుతెచ్చునది, పిలుచుట,
          మీ ఇష్టమని చెప్పుట, బిందులేనివాగ్భవబీజము

కట్ - పోవు, కప్పివేయు, ప్రకాశించు, చూపు,
              ప్రదర్శించు, అవతరించు

కంఠ్ - దుఃఖించు, పోగొట్టుకొను,
                తీవ్రముగా కోరు, గుర్తించు

కత్థ్ -  పొగడుకొను, స్తోత్రముచేయు

కథ్ - చెప్పుట, వెల్లడిచేయుట, మాటలాడుట,
              తెలుపుట,  చూపుట, వివరించుట

కర్ణ్ - చీల్చుట, విసిగించుట, వినుట

కల్ - లెక్కించు, ధ్వనించు, భరించు, మోయు,
              తీసుకొను, తెలిసికొను, ఆలోచించు,
              అనుభవించు,  అనుషించిపోవు, ఆధారపడు

కవ్ - స్తోత్రముచేయుట, వర్ణించుట, రచించుట, చిత్రించుట.

కష్ - రాయుట, పరీక్షించుట, ప్రయత్నించుట,
               ఒరిపిడి రాతిపై గీయుట

కస్ - కదలు, పోవు, చేరు, తొలగించు

కమ్ - కోరుట
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.