జైశ్రీరామ్
|| 15-17 ||
శ్లో. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుధాహృతః|
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః.
తే.గీ. ఉత్తమంబైనపూరుషుండుండె నతడె
చూడ పరమాత్మ, యుండి తా నీడవోలె
నంతటన్ మ్రోయు జగతిని సాంతమతడె
కలడు లేడన్యుడెరుగుమా యిలను పార్థ!
భావము.
ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము
లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు.
|| 15-18 ||
శ్లో. యస్మాత్క్షరమతీతోహమక్షరాదపి చోత్తమః|
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః.
తే.గీ. క్షరముకన్ననతీతుడక్షరముకన్న
మిన్న నేనేను కనుకనే మన్ననమున
వెలుగుదున్ వేదములను నేన్ సులలితముగ
నీవు గ్రహియించు నా కీర్తి నేర్పు మీర.
భావము.
నేను క్షరానికి అతీతుడిని మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడినికనుక
ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.