జైశ్రీరామ్
|| 13-27 ||
శ్లో. యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ.
తే.గీ. స్థావరముజంగములనేది జగమునందు
కలదొ క్షేత్రముక్షేత్రజ్ఞులలిని నొప్ఫి
యున్నదేనని యెరుగుము మన్ననమున
పార్థ! నీవింక వినుతించు పథమునందు.
భావము.
భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది
క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.
|| 13-28 ||
శ్లో. సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి.
తే.గీ. చెడెడివాటిలోనున్నట్టి చెడని తత్వ
మన్ని భూతంబులన్ గల యసమ హరిని,
చూడ గలిగును యోగియే వాడె ఘనుడు,
పార్థ! గ్రహియింపు మియ్యది భవ్యముగను.
భావము.
నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా
ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.