జైశ్రీరామ్.
|| 15-19 ||
శ్లో. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్|
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత.
తే.గీ. అట్టి పురుషోత్తమునునన్నునరయువారు
కనగ సర్వజ్ఞులిద్ధరన్, కనుచు నన్ను
పొంది సేవింపుదురునన్ను పూజ్యమీగను.
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని
తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను
సేవిస్తాడు(పొందుతాడు).
|| 15-20 ||
శ్లో. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ|
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత.
తే.గీ. గుహ్యతమమైన శాస్త్రంబు కోరి తెలిపి
యుంటి గ్రహియించు ధన్యులే యుత్తమోత్త
ములును కృతకృత్యులిద్ధర తెలియుమీవు,
చక్కనైనట్టి ములో జయముగనుము.
భావము.
భారతా! అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్ప బడినది. దీనిని అర్ధము
చేసుకుంటే బుద్ధిమంతుడు కృతకృత్యుడు.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
పురుషోత్తమయోగో నామ పఞ్చదశోऽధ్యాయః22]
పురుషోత్తమప్రాప్తి యోగము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.