జైశ్రీరామ్.
|| 13-33 ||
శ్లో. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే.
తే.గీ. వ్యాప్తభయియున్న నభమెట్టు లంటబఠదొ
దేని చేతను నట్టులే దేహికూడ
యంటబడదెందునున్నను నఖిలభతడె
యయియునర్జునాగ్రహియించు మనుపమముగ
భావము.
ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా
అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.
|| 13-34 ||
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత.
తే.గీ. సూర్యుడొక్కడే జగతికి శోభగూర్చు
కాంతినిచ్చుచు నట్టులే ఘనతరముగ
క్షేత్ర మంతనునొక్క యా క్షేత్రధారి
సత్ప్రకాశంబుతో నొప్ప జక్కగ గను.
భావము.
ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని
ప్రకాశింప చేస్తాడో,
అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.