జైశ్రీరామ్.
|| 13-31 ||
శ్లో. యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా.
తే.గీ. మానవుండెప్పుడందరిన్ మనెడు వాడు
దైవమొక్కడంచెరుగునో తత్వమరసి,
యతడెపో జ్ఞాని, బ్రహ్మం బునతడె చేరు.
పార్థ! నీవిది గ్రహియించి పరవసించు.
భావము.
ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద
ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము
చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.
|| 13-32 ||
శ్లో. అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే.
తే.గీ. ఆది లేనట్టి యా బ్రహ్మ భవ్యయంబు,
దేహమందుండియున్ కర్మ మోహ రహితు
డతడు, కర్మలంటవతనికనుపమాను
డతడె బ్రహ్మంబు గ్రహియించు మర్జునాఖ్య!
భావము.
ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా!
శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.