జైశ్రీరామ్.
|| 13-29 ||
శ్లో. సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.
తే.గీ. సమముగా తాను సర్వత్ర నమరు హరిని
సమముగా గను పూజ్యుండు సన్నుతుడిల
తనను హింసించుకొననివా డనగవచ్చు,
పరమగతి బొందు నాతండు, పార్థవింటె?
భావము.
సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని
తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.
|| 13-30 ||
శ్లో. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి.
తే.గీ. కలుగువాటికి ప్రకృతే కారణమని
ఆత్మ యేమియు చేయబో దనుచు తలచు
నాతడే జ్ఞాని నిజము నీవరయుమిచట
పార్థ సత్యంబు నెరుగుము భవ్యమతిని.
భావము.
అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ
ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.