జైశ్రీరామ్.
సఞ్జయ ఉవాచ |
శ్లో. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||
తే.గీ. భారతా వినుమనుచును పలికె సంజ
యుండు, విని కృష్ణుఁడా యర్జునుం డనిన ప
లుకులను, రథంబు నిలిపెను ప్రకటితముగ
నుభయసైన్యంబు మధ్యన నొప్పిదముగ.
భావము.
సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల
మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,
శ్లో. భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||
తే.గీ. ద్రోణ భీష్మాది ప్రముఖుల తోడ నిచట
ఘనుల కనుమంచు సారథి కవ్వడికనె
కౌరవుల సైన్యబలమును కనులఁ గాంచ
వ్యూహమునెఱింగి సాగుచు పోవ నెంచి.
భావము.
భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ
కౌరవులను చూడు అన్నాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.