గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2021, మంగళవారం

పాఞ్చజన్యం హృషీకేశో ||1-15|| // అనన్తవిజయం రాజా ||1-16|| అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్

శ్లో.  పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |

పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||1-15||

తే.గీ.  పాంచజన్యంబు పూరించెభవ్యుఁడు హరి,

దేవదత్తమర్జనుఁడూదె దిశలుమ్రోగ,

పొండ్రకమ్మూదె భీముఁడు,భయముకలుగ,

యుద్ధమున సైన్యమంతయున్ సిద్ధపడగ.   

భావము.                                                                                           

పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే 

మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు.

శ్లో.  అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||1-16||

తే.గీ.  కుంతికొడుకుధర్మజుడటనంతవిజయ

మూదె,నకులుఁడూదె సుఘోషమోదమలర,

ఊదె మణిపుష్పకంబునుయోధుఁడయిన

మాద్రితనయుఁడు సహదేవమహితుఁడెలమి.

భావము.       

కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే 

వాటినినకుల సహదేవులు ఊదారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.