గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2021, గురువారం

ధృష్టకేతుశ్చేకితానః//యుధామన్యుశ్చ విక్రాన్త//... శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..౫..౬ శ్లోకములు.

జై శ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.

 శ్లో.  ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |

పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5||

మత్తకోకిల.

శ్రీకరా! యల ధృష్టకేతువు, చేకితానుఁడు, వీరుఁడౌ

ప్రాకటంబుగ కాశికాపురిరాజు, శైభ్యుఁడు, ధీరుఁడౌ

రాకుమారుఁడు కుంతిభోజుఁడు క్రాలుచున్ నరపుంగవుం 

డాకడన్బురజిత్తు రాజు, మహాసుయోధులు నిల్చిరే.

భావము.

దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, 

కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.


శ్లో.  యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||1-6||

ఆ.వె.  తా పరాక్రముఁడు యధామన్యుఁ డట వీర్య

వంతుఁడుత్తమౌజు డంతె కాక

యట సుభద్ర తనయు డభిమన్యుడును, ద్రౌప

దీ కుమారు లుండి రాకరముగ..

భావము.

పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర 

కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ 

మహారధులే.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.