జై శ్రీరామ్.
శ్లో. స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములోऽభ్యనునాదయన్ ||1-19||
తే.గీ. భూమి నాకాశమునశంఖపూరణరుతి
మించి భీతిలగ ప్రతిధ్వనించెనపుడు,
ధార్తరాష్ట్రుల హృదయముల్ దర్పముడుగ
చీల్చి నిస్తేజులుగ చేసె చెన్ను గాను.
భావము.
ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.
శ్లో. అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః ||1-20||
శ్లో. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేऽచ్యుత ||1-21||
తే.గీ. యుద్ధస్న్నద్ధులై యట నున్న ధార్త
రాష్ట్ర సుతులను గాంచిన ప్రవరుఁడయిన
అర్జునుఁడు తాను పార్థుతోననియె రథము
సేనలకు మధ్యనిలుపుమంచోనరేంద్ర!
భావము.
అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు
విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు ఋషీకేశునితో ఈ మాట అన్నాడు,
(అర్జున ఉవాచ)
అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు అని అర్జునుడు పలికెను..
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.