గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, డిసెంబర్ 2021, సోమవారం

కృపయా పరయావిష్టో. ||1-28||.//..సీదన్తి మమ గాత్రాణి .. ||1-29||..//..అర్జునవిషాద యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్

అర్జున ఉవాచ |

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||1-28||

తే.గీ.  చూచి ఘన తరంబగు కృపన్  క్షోభ చెంది,

ఘన విషాదంబులో మున్గి, క్షణము నిలిచి,

కృష్ణునిగని పలికెనిటు, కృష్ణ! గాంచ

నుభయ పక్షాల, బంధువులుండిరకట.

భావము. 

అర్జునుడు ఇలాఅన్నాడుఉదృతమైన కరుణ ఆవహించగా 

విషాదంతో ఇలా అన్నాడుయుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న 

నా బంధువులను చూడగా

శ్లో.  సీదన్తి మమ గాత్రాణి ముఖం  పరిశుష్యతి |

వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||1-29||

తే.గీ. కనగ వీరిని కంపంబు కలుగుచుండె,

సిధిలమగుచుండెదేహంబుజిహ్వ యెండె,

గగురుపాటుకులోనైతి, కలతచెంది

మనసుదుర్భలమగుచుండె,మాధవుండ!

భావము.

నాఅవయవాలు శిధిలమై పోతున్నాయినోరు ఎండి పోతుంది

నా శరీరం వణుకుతుందిరోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.

జైహింద్.

                                                                                                                                   


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.