గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, డిసెంబర్ 2021, మంగళవారం

కాలమును వ్యర్థపరచరాదు....చింతా రామ కృష్ణారావు

 జైశ్రీరామ్.
కం. కాలము మన దైవంబగు,
కాలము వినియోగ మెఱిఁగి ఘనమగు ఫలముల్
చాలగ పొందుట నిపుణత.
కాలము వ్యర్థమును చేయగా వలదు జనుల్.  1.

కం. మేలగు పనులొనరించుట
కేళిగ వరజీవనమునకే కృషి నెరపం
జాలును కాలమునరయుచు.
క్షాళనమగు దుష్టచింత సద్వర్తనచే.  2.

కం. కాలముకన్నను ముందుగ
నీ లాఘవమొప్ప నడువ నీకిల మేలౌన్.
కాలము వ్యర్ధము చేసిన
కూలును నీ జీవితంబె కోమల హృదయా!  3.

కం. వ్యర్థము చేయకు కాలము.
వ్యర్థమునొనరింపబోకు వస్తువులను ని
స్వార్థముతో మసలుకొనుచు
సార్థకమగు జీవివగుము సద్గుణగణ్యా!  4.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.