జైశ్రీరామ్.
శ్లో. న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||1-32||
తే.గీ. కోరను విజయము, నే నిన్
గోరను రాజ్యంబు సుఖము, కోరెదఁ జెపుమా
గోరిన రాజ్యము భోగము
నేరీతి ఫలము కలుగును కృష్ణా! కృపతో.
భావము. ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని
కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని,
జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి.
శ్లో. యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||1-33||
తే.గీ. రాజ్య, సుఖ, భోగములెవరి రంజనకని
కోరుచుంటిమో, వీడిరి వారు సర్వ
సంపదలను, ప్రాణములను, శాశ్వతముగ,
నిలిచి యుండిరిచ్చోటనే, నీరజాక్ష!
భావము.
ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు
ప్రాణాలను, సంపదలనుత్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.
జైహింద్
.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.