జైశ్రీరామ్
శ్లో. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13||
తే.గీ. శంఖముల్ భేరులే గాక సమరమునకు
సిద్ధమని దెల్ప పణవముల్, చెలగిమ్రోగె
గోముఖంబులు,తప్పెటల్, కూడి మ్రోగ
వినగ గజిబిజిగాఁ దోచె, విశ్వమునను.
భావము. ఆ
వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ,
మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.
శ్లో. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ |
మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శఙ్ఖౌ ప్రదధ్మతుః ||1-14||
కం. శ్వేతాశ్వరథముపై వి
ఖ్యాతిగ హరియును కిరీటి యలరుచు శంఖం
బాతత గతిఁ బూరించిరి,
జ్ణాతంబవ సైనికులకు జయనాదముగా.
భావము.
అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు
దివ్యశంఖాలను ఊదారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.