గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, డిసెంబర్ 2021, మంగళవారం

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే....1-1... // ...దృష్ట్వాతు పాండవానీకం...1-2... // శ్రీమద్భగవద్గీత అర్జున విషాద యోగములో..1..౨ శ్లోకములు.

జైశ్రీరామ్. 

ఓం నమో భగవతే వాసుదేవాయ.

శ్రీమద్భగవద్గీత

అర్జున విషాద యోగము.

ధృతరాష్ట్ర ఉవాచ ।

1. ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః,

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ.

శా.  ధర్మక్షేత్రముగా నెఱుంగనగు నిద్ధాత్రిన్ గురుక్షేత్రమున్

ధర్మాత్ముండగు పాండుపుత్రులును బోధన్ గల్గు నా పుత్రులున్

గర్మల్ వ్రేచగ చేరిరే సమర కాంక్షన్ వారలుత్సాహులై,

మర్మంబున్విడి యేమి చేయుదురొ, బ్రేమన్.తెల్పుమో సంజయా!

భావము.

ధృతరాష్ట్రుడు పలికెను;  

ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ కాంక్షతో చేరియున్న 

నాయొక్క పుత్రులు, మరియు పాండురాజు కుమారులు ఏమిచేసిరి? 

తెలియఁజేయుము.

సంజయ ఉవాచ:

2. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ !

తే.గీ.  అపుడు దుర్యోధనుండట ననుపమముగఁ

లుఁగు పాండవ వ్యూహమున్ గాంచి వెడలి

గురువు ద్రోణునిఁ జేరెను వరలు భీతిఁ

బలికె తెలియఁగ నతనికి  నిలువ లేక. 

భావము.

ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పల్కెను - ఆ సమయమున రాజైన

దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవ 

సైన్యమును చూచి, ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.