గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, అక్టోబర్ 2018, శుక్రవారం

శ్రీ గోమాత స్తోత్రము. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ.

జైశ్రీరామ్
శ్రీ గోమాత స్తోత్రము. బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు.
జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" ఈ లోకంలో 4 రూపాలతో ఉంటుంది. వారు:-
1. జనక మాత - మనకు జన్మ ఇచ్చిన అమ్మ (కన్న తల్లి)
2. గో మాత - గోవు (ఆవు)
3. భూ మాత - భూదేవి (భూమి)
4. శ్రీ మాత - దేవాలయాలలోని అమ్మవారు
మనకు కష్టాలు, బాధలు వచ్చినపుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనలను కాపాడుతుంది.
గో మాత:-
జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" యొక్క 1000 నామాలలో (శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లో) "గోమాతా" అనే పేరు ఒకటి. అంటే "గో మాత" సాక్షాత్తూ పరదేవత యే (శ్రీ ఆదిపరాశక్తి యే). కనుక గోమాత "శ్రీ లలితాంబికా దేవి" యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు
1. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే.
2. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తూ పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే.
3. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు పూజ చేసినట్లే.
4. గర్బగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి, మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు అలంకరణ చేసినట్లే.
5. గోవులు, దూడలు నేల మీద నడిచి వెళుతుంటే, వాటి వెనుకన మనం నడిచినపుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి, దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపై ఉంది.
6. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడూ శుభమే జరుగుతుంది.
అటువంటి గోవును హింసించడం, గోవును చంపడం చేస్తే సాక్షాత్తూ పరదేవతను అవమానించినట్లే. ఇలా చేయడం మహా పాపం. 5 మహా పాతకాలలో "గో హత్యా మహా పాతకం" ఒకటి. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి. గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు "గోవిందుడు" (గోవులను రక్షించువాడు - శ్రీ మహా విష్ణువు). గోవులకు హాని చేసి, తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవతా అనుగ్రహం లభించదు.
"గో" అనగా --- గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అని అర్థం. వీటినన్నింటినీ రక్షించువాడు "గోవిందుడు".
స్వస్తి!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మనకు బాధలు కలిగి నప్పుడు వాటిని తొలగించ డానికి అమ్మవారి రూపాలను, గోమాత యొక్క విశిష్ఠతను అద్భుతము గా వివరించి నందులకు కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.