జైశ్రీరామ్.
శ్లో. సంతోషస్త్రిషు కర్తవ్యః స్వదారే భోజనే ధనే త్రిషుచైవ న కర్తవ్యోధ్యయనే జపదానయోః
ఆ.వె భార్య విషయమందు, వంటకంబులయందు,
ధనమునందు తృప్తి మనకు తగును.
చదువు, దాన, జపములఁ దనియ కుండుట
మేలు కూర్చు మనకు శ్రీలు కూర్చు.
భావము.తనభార్య,భోజనం,ధనం - అనే మూడిటియందు సంతుష్టి ఉండాలి. అధ్యయనం, జపం, దానం అనే
మూడిటియందు మాత్రం ఉండకూడదు!
జైహింద్.
1 comments:
నమస్కారములు
మంచి సూక్తి . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.