జైశ్రీరామ్.
సద్బుధ,మృదుపద,సరసిజ,బంధక,పటుతర,చిటికెలో,సభ్యతా,అమరిక,నవమేలు,గ్రహభ్రమక,గర్భ"-చటుల"-వృత్తము.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
"-చటుల"-వృత్తము.ఉత్కృతిఛందము.స.భ.భ.న.న.భ.న.త.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నవమే"-లోకము నేలును!నవగ్రహ భ్రమకాన!నటకలి'లోకం బమరున్?
భవ బంధాలకు మూలము!పవలు నిశలు కల్గు!పటుతర కీర్తిం గనుమా!
శివ మేర్పంగను సాగవె!శివ శివ యన ముక్తి!చిటికెలొ జీవం బెగురున్!
జవమే!సర్వము కాదయ?చవిచెడు భవి జీవ!చటులము కాయంబగునే?
చటులము=అందము,ధృడము,కాయంబు=శరీరము,అగునా=అవునా!(కాదు),ఈధృఢత్వము,అందము చివరివరకునుండవు!
హేయమై,వివత్సరమై,మేథోస్తి,మజ్జ మాంసా శృక్కైనదేహమ మశాశ్వతము
చవిచెడు=రుచి(కాంతి)గీడ్పడును,నటకలి=జీవన రంగస్థలమున నటించు
పాత్ర,,నవము=తొమ్మిది సంఖ్య,నవగ్రహములు,నవలేలు లోకము=జగత్తును
9,సంఖ్యయే పరిపాలించుచున్నది,భవబంధాలు=ఇహమందలి సంసారాది లాంపట్యములు.చిటికెలొ=లిప్త కాలములో,
1.గర్భగత"-సద్బుధ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.భ.గణములు.వృ.సం.436.ప్రాసగలదు.
నవమే!లోకము నేలును!
భవ బంధాలకు మూలము,
శివ మేర్పంగను సాగవె!
జవమే!సర్వము కాదయ?
2.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గల.గణములు.వృ.సం.192.ప్రాసగలదు.
నవగ్రహ భ్రమకాన!
పవలు నిశలు కల్గు!
శివ శివ యన ముక్తి!
చవి చెడు భవి జీవ!
3.గర్భగత"-సరసిజసివృత్తము.
బృహతీఛందము.న.య.స.గణములు.వృ.సం.203.ప్రాసగలదు.
నటకలి లోకంబమరున్?
పటుతర కీర్తిం గనుమా!
చిటికెలొ!జీవం బెగురున్?
చటులము కాయం బగునే?
4.గర్భగత"-బంధక"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.భ.న.న.గల.గణమలు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నవమే!లోకము నేలును!నవగ్రహ భ్రమకాన!
భవ బంధాలకు మూలము!పవలు నిశలు కల్గు?
శివ మేర్పంగను సాగవె?శివ శివ యన ముక్తి!
జవమే!సర్వము కాదయ!చవిచెడు భవి జీవ!
5.గర్భగత.లఘ్వంత"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.న.త.లగ.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నవగ్రహ భ్రమకాన!నటకలి లోకంబమరున్?
పవలు నిశలు కల్గు!పటుతర కీర్తిం కనుమా!
శివ శివ యన ముక్తి!చిటికెలొ! జీవం బెగురున్!
చవిచెడు భవి!జీవ!చటులము కాయంబగునే?
6.గర్భగత.లఘ్వంత"-చిటికెలొ"-.
ఉత్కృతిఛందము.న.న.భ.న.త.జ.య.స.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నవగ్రహ భ్రమకాన!నటకలి లోకం బమరుం?నవమే!లోకము నేలును?
పవలు నిశలు కల్గు!పటుతర కీర్తిం కనుమా!భవ బంధాలకు మూలము!
శివ శివ యన ముక్తి!చిటికెలొ!జీవం బెగురుం!శివ మేర్పంగను సాగవె?
చవిచెడు భవి జీవ!చటులము కాయంబగునే?జవమే!సర్వముకాదయ!
7.గర్భగత"-సభ్యతా"-వృత్తము.
ధృతిఛందము.న.య.స.స.భ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నటకలి లోకంబమరుం?నవమే!లోకము నేలును!
పటుతర కీర్తిం కనుమా!భవ బంధాలకు మూలము!
చిటిెకెలొ జీవం బెగురుం!శివ మేర్పంగను సాగవె?
చటులము కాయంబగునే?జవమే!సర్వము!కాదయ!
8.గర్భగత.లఘ్వంత"-అమరిక"-
ఉత్కృతిఛందము.న.య.స.స.భ.భ.న.న.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నటకలి లోకం బమరుం?నవమే!లోకము నేలును?నవగ్రహ భ్రమకాన!
పటుతర కీర్తిం కనుమా!భవ బంధాలకు మూలము!పవలు నిశలు కల్గు!
చిటికెలొ!జీవం బెగురుం!శివ మేర్పంగను సాగవె?శివ శివ యన ముక్తి!
చటులము కాయంబగునే?జవమే!సర్వము కాదయ!చవిచెడు భవి జీవ!
9,గర్భగత"-నవ మేలు"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.య.స.లల.గణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నవగ్రహ భ్రమకాన!నవమే!లోకము నేలును?
పవలు నిశలు కల్గు!భవ బంధాలకు మూలము!
శివ శివ యన ముక్తి!శివ మేర్పంగను సాగవె?
చవిచెడు భవి జీవ!జవమే?సర్వము కాదయ!
10,గర్భగత"-గ్రహభ్రమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.భ.య.స.న.న.త.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
నవగ్రహ భ్రమకాన!నవమే!లోకము నేలును?నటకలి లోకం బమరున్?
పవలు నిశలు కల్గు!భవ బంధాలకు మూలము!పటుతర కీర్తిం కనుమా!
శివ శివ యన ముక్తి!శివ మేర్పంగను సాగవె?చిటికెలొ జీవంబెగురున్?
చవిచెడు భవి జీవ!జవమే!సర్వము కాదయ?చటులము కాయంబగునే?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
1 comments:
నమస్కారములు
గర్భగత వృత్తము లన్నియు అలరించు చున్నవి .శ్రీ వల్లభవఝులవారికి , అందించిన శ్రీ చింతా సోదరులకు అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.