గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, అక్టోబర్ 2018, బుధవారం

శ్లో. మృగమద! మాకీరు గర్వమ్. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. మృగమద! మాకీరు గర్వమ్. 
పరిమళమాత్రేణ తం త్వముపయాసి.
పరిమళ, శీతలతా, నిర్మలతా, 
స్సుకుమారతా చ, కర్పూరే.(పండితరాయలశ్లోకము)
మ. గరువంబొందఁగబోకు నీవు వినుమా కస్తూరి! నీ సౌరభం
బరయన్ సద్గుణమొక్కటేను. కనుమాయానంద కర్పూరమున్.
పరమోదంచిత సౌరభంబు, నవురున్, బ్రఖ్యాత నైర్మల్యమున్,
వరణీయంబగు సీతలత్వమును సంవాసించునద్దానిలో.
భావము.
ఓ  కస్తూరీ ! ఒక్కపరిమళము తప్ప నీలో మరోసుగుణ్ము ఏదీ లేదు. కర్పూరములో పరిమళమూ  శీతలతా నిర్మలతా  సుకుమారతా కూడాఉన్నాయి కనుక అనవసరంగా గర్వపడకు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది మంచి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.